ఒక్కోసారి శాంతి నెలకొల్పాలంటే కత్తి పట్టాల్సిందే అంటున్న పవన్ కళ్యాణ్..!

ఒక్కోసారి శాంతి నెలకొల్పాలంటే కత్తి పట్టాల్సిందే అంటున్న పవన్ కళ్యాణ్..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టిడిపి ప్రజాప్రతినిధులపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు తాను చేస్తున్న ప్రజా పోరాట యాత్రలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలుగు ప్రజలను అన్యాయంగా అవమానపరిచిన కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడాని తీవ్రంగా తప్పు పట్టారు పవన్ కళ్యాణ్. దేశం కోసం రాష్ట్రం కోసం ఎంతో మంది తెలుగు మహానుభావులు అప్పట్లో బ్రిటిష్ వారితో పోరాడిన ఘనత ఉందని..అయితే ఈ నాడు స్వార్థ రాజకీయాల కోసం తెలుగు ప్రజల భవిష్యత్తును కకావికలం చేస్తూ రాజకీయ నేతలు వెన్నుపోటు పొడిచిన వ్యక్తులతో చేతులు కలపడం నిజంగా దారుణమని పేర్కొన్నాడు పవన్. పొట్టి శ్రీ‌రాములు 56 రోజులు నిరాహార దీక్ష చేసి సాధించిన రాష్ట్రాన్ని ఉత్త‌ర భార‌త నాయ‌కుల‌కు, కాంగ్రెస్ పెద్ద‌ల‌కు తాక‌ట్టుపెడ‌తారా? మీరూ మ‌నుషులేనా? అని టీడీపీ శ్రేణుల‌పై ప‌వ‌న్ విరుచుకుప‌డ్డారు.
 
రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా క‌ల్పిస్తామ‌ని బీజేపీ, కాంగ్రెస్ అడ్డంగా విడిదీశాయ‌ని, ఏపీలో పౌరుషం లేని టీడీపీ నాయ‌కుల వ‌ల్ల మ‌న ఆత్మ‌గౌర‌వం దెబ్బ‌తింటోంద‌ని, అందుకే టీడీపీని ఏపీ నుంచి త‌రిమి త‌రిమి కొడ‌దామ‌ని పిలుపునిచ్చారు. ఏపీ విష‌యంలో అన్యాయం జ‌రుగుతున్నా చంద్ర‌బాబు, జ‌గ‌న్‌, లోకేష్‌ల‌కు ప‌ట్ట‌డం లేద‌నివారికి గాంధీ గిరిలో చెబితే అర్థం కాద‌ని, వారికి తోలు మంద‌మైంద‌ని విరుచుకుప‌డ్డారు. అవినీతిపరులను దోపిడీదారులను పరిగెత్తించే పార్టీ జనసేన పార్టీ అని ప్రస్తుత సమాజంలో పరిస్థితుల బట్టి శాంతి నెలకొల్పాలంటే కచ్చితంగా కత్తి పట్టే రోజులు వచ్చాయని ఇదే విషయం ఆనాడు కవి శివారెడ్డి చెప్పారని వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్. దీంతో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ నేతలపై చేసిన వ్యాఖ్యలు ఏపీ రాష్ట్రంలో పెద్ద హాట్ టాపిక్ గా మారయి.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top