చంద్రబాబుకి ఊహించని షాక్.. భేటీ కి నో చెప్పిన విపక్షాలు !

By Xappie Desk, November 19, 2018 23:00 IST

చంద్రబాబుకి ఊహించని షాక్.. భేటీ కి నో చెప్పిన విపక్షాలు !

ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. గత నాలుగేళ్లుగా బీజేపీతో కలిసి వారి పరిపాలనలో ఇమడలేక, రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురాలేక, సొంత రాష్ట్రంలో విమర్శలు తప్పించుకునేందుకు బిజెపి నుండి విడిపోయి, విపక్షాల అన్నింటిని ఏకం చేసి బాబు మహా కూటమి ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే తనకు ఎంతగానో ఉపయోగపడతాయని భావించిన అదే కూటమి నుండి బాబుకి ఎదురు దెబ్బ తగిలింది.
 
మామూలుగా అనుకున్న ప్రకారం ఈ నెల 22న విపక్షాలతో బాబు భేటీ జరగాలి. ఇదే విషయమై ఆయన రాహుల్ గాంధీని కూడా కలిసి మాట్లాడారు. ఈ క్రమంలో తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ - బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో భేటీ కోసం ఇప్పటికే చంద్రబాబు కోలకత్తా వెళ్లారు. అయితే ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సమావేశ తేదీపై అభ్యంతరం వ్యక్తం చేశారు. విపక్షాల మధ్య ఐక్యత కొరవడడమే దీనికి కారణమట. బీజేపీ వ్యతిరేక పార్టీలను ఒక్కొక్కటిగా కలిసి కేంద్రాన్ని దెబ్బకొట్టాలన్న బాబు వ్యూహానికి ఆదిలోనే అడ్డుకట్ట పడింది. ఎస్పీ చీఫ్ అఖిలేష్ - బీఎస్పీ చీఫ్ మాయావతి.. కాంగ్రెస్ ను విమర్శిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో అన్ని పక్షాలు లేకుండా సమావేశానికి మమతా బెనర్జీ అడ్డు చెప్పారు. అసలు. ఈమీటింగ్ లో కాంగ్రెస్ పాత్ర ఏంటి అనేదాని పైన శరద్ పవార్, మమతా బెనర్జీ కూడా వాదించుకుంటున్నారు.
 
అయితే ఈ భేటీ ఇప్పుడు వాయిదా పది జనవరి 19న జరుగుతుందని టీడీపీ నేతలు చెప్తున్నారు. ఇది కేంద్ర స్థాయిలో భారీ ఎత్తున్న ప్లాన్ చేసి బీజేపీని పడగొట్టెందుకు భవిష్యత్తు కార్యాచరణ పైన ఈ కూటమి దృష్టి సారించనుండి. లోక్ సభ సాధారణ ఎన్నికల నాటికి ఇది కూటమిగా రూపుదాల్చనుందని అంటున్నారు. ఏది ఏమైనా...ఇది బాబుకు షాక్ వంటిదేనని అంటున్నారు.Top