జగన్ కు షాక్ ఇచ్చిన కొడాలి నాని !

By Xappie Desk, November 19, 2018 23:08 IST

జగన్ కు షాక్ ఇచ్చిన కొడాలి నాని !

తెలంగాణలోని ముందస్తు ఎన్నికల్లో భాగంగా టీడీపీకి కంచుకోటగా చెప్పబడే కూకట్ పల్లి నుండి వారి అభ్యర్థిగా నందమూరి సుహాసినిని నిలబెట్టడం ఇప్పుడు వైసీపీకి తలనొప్పిగా మారింది. వైసీపీలో కీల‌కంగా ఉన్న ఓ నేత సుహాసిని త‌ర‌ఫున కూక‌ట్‌ప‌ల్లిలో ప్ర‌చారానికి సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో ఆ నాయ‌కుడికి స‌ర్దిచెప్ప‌లేక జ‌గ‌న్ త‌ల ప‌ట్టుకుంటున్న‌ట్లు స‌మాచారం. వైసీపీలో అందరి పైనా జగన్ విరుచుకుపడితే, ఆ ఒక్క నేతను మాత్రం ఆయన ఏమి అనలేడు. అతనే కొడాలి నాని.
 
గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ముక్కుసూటి మ‌నిషి. తాను ఏం అనుకుంటే అది చేస్తాడు. కృష్ణా జిల్లాలో వైసీపీ కీల‌క నేత‌ల్లో ఆయ‌న ఒక‌రు. ఆయనకు టీడీపీ అన్నా, చంద్రబాబు అన్నా కూడా అస్సలు పడదు. అయితే సమస్య ఎంటి అనుకుంటున్నారా ? ఇక్కడ వచ్చిన చిక్కు అంతా, అతనికి జూ.ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధమే. జూనియ‌ర్ ఎన్టీఆర్ తండ్రి దివంగ‌త హ‌రికృష్ణ‌తోనూ నాని చాలా ఆత్మీయంగా ఉండేవారు. వైసీపీ-టీడీపీల మ‌ధ్య బ‌ద్ధ శ‌త్రుత్వం ఉన్నా.. హ‌రికృష్ణ కుటుంబంతో స్నేహాన్ని మాత్రం నాని వ‌దులుకోలేదు.
 
అదే సన్నిహితమైన సంబంధంతో ఇప్పుడు కూకట్ పల్లి అభ్యర్థిగా నిలబడుతున్న సుహాసిని తరుపున ఇతను ప్రచారం చేయాలనే ఆలోచనతో ఉన్నాడట. ఒక వైసీపీ ఎమ్మెల్యే అయి ఉండి, ఇలా టీడీపీ పక్కన ప్రచారం చేయడం ఎంటి అని అందరూ అనుకుంటుంటే ఈయన మాత్రం నేరుగా. ఈవిషయమై జగన్ కే ఫోన్ చేసి చెప్పేశాడట. నాని మాట‌ల‌తో జ‌గ‌న్ ఒక్క‌సారిగా నిశ్చేష్టుడ‌య్యార‌ని తెలుస్తోంది. తాను వ‌ద్ద‌న్నా నాని వింటాడో లేదోనని అనుమానించిన జ‌గ‌న్‌.. ప్ర‌స్తుతానికి విష‌యాన్ని ప‌క్క‌న‌పెట్టాయ‌ల‌ని భావించార‌ట‌. అందుకే తాను ఇప్పుడు బిజీగా ఉన్నాను అని చెప్పి ఫోన్ పెట్టేశారట. చివరికి ఇప్పుడు జగన్ ఎం చేయాలో పాలుపోక తల పట్టుకుని కూర్చున్నాడు.Top