సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ పై మళ్ళీ మాటల యుద్ధం మొదలు పెట్టిన కత్తి మహేష్..!

By Xappie Desk, November 20, 2018 09:52 IST

సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ పై మళ్ళీ మాటల యుద్ధం మొదలు పెట్టిన కత్తి మహేష్..!

గతంలో పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో దారుణంగా విమర్శలు చేసి అనేకమంది చేత చీవాట్లు తిన్న విషయం మనకందరికీ తెలిసినదే. అయితే గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న కత్తి మహేష్ తాజాగా ఎన్నికల ముందు మళ్లీ పవన్ కళ్యాణ్ పై మాటల యుద్ధం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియా ఫేస్ బుక్ లో కత్తి మహేష్ జనసేన పార్టీ గురించి మరియు పవన్ కళ్యాణ్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు.
 
కాంగ్రెస్ వ్య‌తిరేక‌త‌, రాజ‌కీయ శూన్య‌త‌.. క‌మ్మ కుల అధికార దాహం… ఎన్‌.టి.రామారావు చ‌రిష్మా.. ఇవ‌న్నీ క‌లిపి తెలుగు దేశం పార్టీ పెట్టిన తొమ్మిది నెల‌ల కాలంలో అధికారంలోకి వ‌చ్చింది. ప‌వ‌న్‌క‌ల్యాణ్ తెలివి శూన్య‌త‌… కొణిదెల బ్ర‌ద‌ర్స్ / ఫ‌్యామిలీపై అప‌న‌మ్మ‌కం..కాపు కుల అనైక్య‌త.. రాజ‌కీయ స‌మృద్ధి (బాబు, జ‌గ‌న్‌) క‌ల‌గ‌లిపి ప‌వ‌న్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చి తొమ్మిదేళ్ల‌యినా జ‌న‌సేన 3 నుంచి 7 సీట్లు మించి గెల‌వ‌డు అంటూ కామెంట్లు చేయడంతో కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారయి.
 
మరో పక్క పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని ప్రేమించే వాళ్ళు సోషల్ మీడియాలో కత్తి మహేష్ పెట్టిన పోస్ట్ కి గట్టి కౌంటర్ లు వేస్తున్నారు. ఈ రోజుల్లో స్వచ్ఛమైన రాజకీయాలు చేయడం కోసం కొన్ని కోట్లు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు నిస్వార్ధంగా ప్రజాసేవ చేసే వాళ్ళు చూపించు అంటూ కత్తి మహేష్ కి సవాల్ విసురుతున్నారు..ఇష్టం వచ్చినట్లు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే ఊరుకోమని మరికొంతమంది వార్నింగ్ కూడా ఇచ్చారు.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top