జనసేన పార్టీ ముఖ్య నాయకుల పై పగబట్టిన రోడ్డు ప్రమాదలు..!

By Xappie Desk, November 20, 2018 09:58 IST

జనసేన పార్టీ ముఖ్య నాయకుల పై పగబట్టిన రోడ్డు ప్రమాదలు..!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరడం జరిగింది. గుంటూరు జిల్లా తెనాలిలో తనకంటూ ప్రజలలో ప్రత్యేకమైన అభిమానాన్ని సొంతం చేసుకున్న నాదెండ్ల మనోహర్ ప్రజల కోరిక మేరకు ఇటీవల పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే పార్టీలో చేరిన నాటి నుండి పవన్ కళ్యాణ్ తో సన్నిహితంగా మెలుగుతూ ప్రతి సభలో హాజరవుతూ పార్టీ కి కావలసిన రాజకీయ నిర్ణయాలలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ప్రయాణిస్తున్న కాన్వాయ్ ని లారీ ఢీ కొనడం జరిగింది.
 
అయితే ఆవాహన పవన్ కళ్యాణ్ ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది ఉండటంతో చిన్నపాటి గాయాలతో ప్రమాదం నుండి తప్పించుకున్నారు. ఈ నేపధ్యంలో తాజాగా నాదెండ్ల మనోహర్ ప్రయాణిస్తున్న కారును లారీ ఢీ కొట్టింది. ఇటీవల నాదెండ్ల మనోహర్ జూబ్లీ హిల్స్ నుండి మాదాపుర్ ప్ర‌యాణిస్తుండ‌గా.. కారు వెనుక‌నుండి ఒక లారీ వ‌చ్చి ఢీ కొట్టింది. కారు వెనుక భాగం పూర్తిగా దెబ్బతినగా.. ఆయ‌న తృటిలో ప్ర‌మాధం నుండి త‌ప్పించుకున్నారు. మ‌నోహ‌ర్ కారు డ్రైవర్ ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు లారీ డ్రైవర్‌ నాగరాజుపై ఐపీసీ 336, 279 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలా ఒక్కసారిగా రోడ్డు ప్రమాదాలకు జనసేన పార్టీలో ముఖ్య నాయకులకు జరగటంతో చాలామంది జనసేన పార్టీ కార్యకర్తలు మరియు పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన పార్టీ పై ఎన్నికల ముందు ఏదో కుట్ర జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top