చంద్రబాబు గురించి డిస్కషన్ లు చేస్తున్న బీజేపీ పెద్దలు..!

By Xappie Desk, November 20, 2018 10:09 IST

చంద్రబాబు గురించి డిస్కషన్ లు చేస్తున్న బీజేపీ పెద్దలు..!

ఏపీ ముఖ్యమంత్రి టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఇటీవల కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తో భేటీ అయిన విషయం మనకందరికీ తెలిసినదే. దేశ సమగ్రత కోసం దేశంలో ప్రజాస్వామ్యం కాపాడటం కోసం బిజెపికి వ్యతిరేకంగా అన్ని పార్టీలను చంద్రబాబు ఏకం చేస్తూ జాతీయ రాజకీయాలలో కీ రోల్ గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల దక్షిణాది రాష్ట్రాలలో కొంతమంది ప్రముఖ నాయకులను కలిసిన చంద్రబాబు తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెసు పార్టీ అధినేత్రి మమతాబెనర్జీతో చంద్రబాబు భేటీ అయ్యారు.
 
అయితే ఈనెల 22వ తారీఖున బిజెపికి వ్యతిరేకంగా దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల నుంచి సమావేశం నిర్వహించాలని భావించిన బాబు..తాజాగా తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఈ సమావేశాన్ని డిసెంబర్ మొదటి వారంలో నిర్వహిద్దామని బాబు అనుకుంటున్నట్లు సమాచారం. ఇదే క్రమంలో డిసెంబర్ మొదటి వారంలో జరగబోయే ఈ సమావేశానికి ఇప్పటికే చంద్రబాబు చాలా రాజకీయ పార్టీలను బిజెపికి వ్యతిరేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో చంద్రబాబు ఈ విధంగా బిజెపికి వ్యతిరేకంగా అడుగులు వేస్తున్న క్రమంలో బీజేపీ పెద్దలు లో కూడా చంద్రబాబు చేస్తున్న రాజకీయం గురించి చర్చ మొదలైనట్లు సమాచారం.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com


Top