జనసేన పార్టీ లోకి ఎంట్రీ ఇస్తున్న రెబల్ స్టార్ కృష్ణంరాజు భార్య..?

By Xappie Desk, November 20, 2018 11:23 IST

జనసేన పార్టీ లోకి ఎంట్రీ ఇస్తున్న రెబల్ స్టార్ కృష్ణంరాజు భార్య..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో చాలా మంది ప్రముఖులు సినీ ఇండస్ట్రీకి చెందిన వారు రాజకీయాల్లో రాణించాలని ప్రజా సేవ చేయాలని భావిస్తున్న చాలామంది వివిధ రాజకీయ పార్టీల కండువా కప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఏపీ లో రాజకీయ ముఖచిత్రాన్ని గమనిస్తే తెలుగుదేశం పార్టీపై రోజు రోజుకి ప్రజలలో తీవ్ర ప్రజా వ్యతిరేకత పేరిగిపోతుంది...ముఖ్యంగా పార్టీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తమ స్వార్ధ రాజకీయాలకోసం అన్యాయంగా విభజించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తో చేతులు కలపడంతో ఏపీ లో ఉన్న ప్రజలు చంద్రబాబు ప్రభుత్వాన్ని అసలు నమ్మటం లేదు. విభజన హామీల విషయంలో చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇప్పుడు ఎన్నికల ముందు రాష్ట్రాన్ని దారుణంగా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడానికి ఏపీ ప్రజలు తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఇదే క్రమంలో జనసేన మరియు వైసిపి పార్టీలు చంద్రబాబు ప్రభుత్వం పై విమర్శల వర్షం కురిపిస్తూ రెండు పార్టీల అధినేతలు అయినా జగన్ మరియు పవన్ ప్రజలలో ఉంటూ ఒకరు పాదయాత్ర చేస్తూ మరొకరు ప్రజాపోరాట యాత్ర చేస్తూ ఏపీ రాజకీయాన్ని రసవత్తరంగా మారుస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీలో చేరడానికి బీజేపీ నేత రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు స‌తీమ‌ణి శ్యామ‌లా దేవి రెడీ అయినట్లు అది ఇండస్ట్రీలోనూ ఇటు రాజకీయాల్లోను గా కనబడుతుంది. ఇదే విషయం సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుండటం విశేషం. రానున్న ఏపీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి కృష్ణంరాజు భార్య శ్యామలా దేవి పోటీ చేయనున్నట్లు తెగ వార్తలు వినపడుతున్నాయి.Top