రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిన పవన్ చెన్నై పర్యటన..!

By Xappie Desk, November 20, 2018 11:37 IST

రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిన పవన్ చెన్నై పర్యటన..!

పవన్ కళ్యాణ్ బుధవారం చెన్నై వెళ్తున్న పర్యటన ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. ముఖ్యంగా ఈ పర్యటనలో జనసేన అధినేత పవన్ కీలక ప్రకటన చేయనున్నట్లు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో టాక్ వినపడుతుంది. మరియు అదే విధంగా పవన్ కళ్యాణ్ చెన్నై వెళ్లే రోజు ఇటు చంద్రబాబు కూడా ఢిల్లీ వెళ్తున్న నేపథ్యంలో ఏపీ లో ఏదో జరుగుతుంది అన్న విశ్లేషణలు కొంతమంది సీనియర్ రాజకీయ నేతలు చేస్తున్నారు. సాధారణంగా పవన్ పర్యటనకు సంబంధించిన విషయాలను ఒకరోజు ముందుకు మీడియాకు తెలిపే జనసేన పార్టీ.. ఈ సారి రెండు రోజుల ముందు సమాచారం ఇవ్వడం వెనుక ఏదో కీలక విషయం దాగుందని తెలుస్తోంది. మరో పక్క పవన్ కళ్యాణ్ మద్దతుదారులు ఆంధ్రలో జనసేన పార్టీ బలంగా ఉన్న నేపథ్యంలో దిగువ రాష్ట్రాల్లో కూడా ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ విస్తరించడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు మొదలుపెడుతున్నాడు అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో బిజెపి పార్టీ దేశంలో లేకుండా పవన్ కళ్యాణ్ తన వంతుగా కృషి చేస్తున్నట్లు మరికొంతమంది నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ చెన్నై లో తనకు మద్దతుగా ఉండే వారితో భేట్టి అవుతున్నట్లు భవిష్యత్తులో జనసేన పార్టీ చేపట్టే కార్యక్రమాల గురించి వారితో పంచుకోబోతున్న ట్లు సమాచారం.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top