తెలంగాణ ప్రాజెక్టులు ఆపేవాడు చంద్రబాబు అంటూ కేసీఆర్ ఫైర్..!

By Xappie Desk, November 20, 2018 11:37 IST

తెలంగాణ ప్రాజెక్టులు ఆపేవాడు చంద్రబాబు అంటూ కేసీఆర్ ఫైర్..!

ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ సీఎం చంద్రబాబు పై విమర్శల వర్షం కురిపించారు. టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఏర్పడిన మహా కూటమి పై తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ ప్రసంగాన్ని హోరెత్తించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల ఖమ్మం జిల్లాలో జరిగిన మహాసభలో కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చేయడానికి కడుతున్న ప్రాజెక్టుల పనుల విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు అనేకసార్లు కేంద్రానికి లేఖలు రాసి నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాజెక్టులను ఆపేయాలని చంద్రబాబు చూశారని..అటువంటి వ్యక్తిని తిరిగి తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెట్టనిదామా? అంటూ...మ‌న ప్రాజెక్టుల‌ను అడ్డుకున్న వారిని గెలిపించి మ‌న కంటినే పొడుచుకుందామా? అని ఎదురు ప్ర‌శ్నించారు.
 
సీతారామ ప్రాజెక్టును అడ్డుకునేందుకు చంద్ర‌బాబు కుట్ర‌లు చేసిన మాట వాస్త‌వం కాదా?. ఈ ప్రాజెక్టును అడ్డుకోవ‌డం కోసం చంద్ర‌బాబు కేంద్రానికి రాసిన లేఖ‌ను వెన‌క్కు తీసుకుంటాడో లేదో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఇక్క‌డి ప్ర‌జ‌ల్ని మోసం చేసిన చంద్ర‌బాబు మ‌ళ్లీ ఏ ముఖం పెట్టుకుని ఓట్ల‌డుగుతాడ‌ని మండిప‌డ్డారు. విపక్ష పార్టీలు ఎన్ని కుయుక్తులు పన్నినా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మంలో అన్ని నియోజకవర్గాలలో టిఆర్ఎస్ గెలుపు జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు కెసిఆర్.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top