కూకట్ పల్లి నియోజకవర్గ ప్రజలకు ప్రశ్నలతో చమటలు పట్టించిన పోసాని..!

కూకట్ పల్లి నియోజకవర్గ ప్రజలకు ప్రశ్నలతో చమటలు పట్టించిన పోసాని..!

సీనియర్ సినీ నటుడు రచయిత పోసాని కృష్ణ మురళి దివంగత హరికృష్ణ కూతురు నందమూరి సుహాసిని పై సంచలన కామెంట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రెండో అసెంబ్లీ ఎన్నికల విషయంలో మహా కూటమి లో భాగమైన తెలుగుదేశం పార్టీ కుక్కట్ పల్లి నియోజకవర్గం లో టిడిపి తరఫున నందమూరి సుహాసిని పోటీ చేస్తున్న విషయం మనకందరికీ తెలిసినదే. ఈ నేపథ్యంలో పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ నందమూరి హరికృష్ణ గారి తో 30 ఏళ్ల అనుబంధం ఉందని..ఆయన వ్యక్తిగత జీవితంలో ఎన్నో విషయాలను తనతో పంచుకున్నారని..చంద్రబాబు హరికృష్ణ ని ఎన్నిసార్లు మోసం చేశారో మీకు తెలియదా అంటూ సుహాసినిని ప్రశ్నించారు.
 
అటువంటి కన్నతండ్రి ని అవమానించిన వ్యక్తి మిమ్మల్ని రాజకీయాల్లోకి ప్రోత్సహిస్తుంటే మీరు నమ్మడం దురదృష్టకరమని పేర్కొన్నారు. అమాయకురాలైన సుహాసినిని చంద్రబాబు రోడ్ మీదకి తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె గెలిచినా, ఓడినా అవమానమే.. చంద్రబాబు మాయలో పడి కమ్మ సెంటిమెంట్ తీసుకొస్తే తెలంగాణా వాళ్లు స్థానిక సెంటిమెంట్ తీసుకొస్తే ఇక్కడ ఆంధ్రావాళ్లు సంతోషంగా బతకగలరా.? ఓటు అనేది నిజాయితీగా వెయ్యాలి.. కమ్మ కోణంలో ఓటు వేయొద్దు.. ఇక్కడి ఆంధ్రావాళ్లంతా అన్నదమ్ముల్లా కలిసిపోయారు.
 
కూకట్ పల్లిలో ఎక్కువగా కమ్మవాళ్లు ఉన్నారనే సుహాసిని చంద్రబాబు అభ్యర్ధిగా ప్రకటించారు తప్ప ప్రజలకు సేవ చేద్దామని కాదు అంటూ చంద్రబాబుపై ఫైర్ అయ్యారు పోసాని కృష్ణ మురళి. అదేవిధంగా కూకట్ పల్లి నియోజకవర్గ ఓటర్ నుద్దేశించి మాట్లాడుతూ సుహాసిని ఎంతమందికి తెలుసు అంటూ ప్రశ్నిస్తూ ఎలక్షన్ లో ఓటు వేసేటప్పుడు కులాన్ని కాకుండా గుణం బట్టి ఓటు వేస్తే మంచి నాయకుడు వచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు పోసాని.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top