పవన్ కళ్యాణ్ ఎక్కడ నుండి పోటీ చేస్తారో క్లారిటీ ఇచ్చిన జనసేన పార్టీ నాయకుడు..!

పవన్ కళ్యాణ్ ఎక్కడ నుండి పోటీ చేస్తారో క్లారిటీ ఇచ్చిన జనసేన పార్టీ నాయకుడు..!

త్వరలో ఏపీ రాష్ట్రంలో ఎన్నికలు ముంచుకొస్తున్న నేపద్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ నుండి పోటీ చేస్తారో ఆ పార్టీకి చెందిన ముత్తా గోపాలకృష్ణ కొంత క్లారిటీ ఇచ్చారు. గతంలో పవన్ కళ్యాణ్ రాయలసీమ ప్రాంతం అత్యంత కరువు జిల్లా అయినా అనంతపురం జిల్లాలో పోటీ చేస్తానని పేర్కొనడం జరిగింది..అయితే అనంతపురం విషయమై ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ప్రకటన చేసిన నాటి నుండి ఇప్పటి వరకు మాట్లాడలేదు..ఇదే క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గం నుండి కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి..అదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా ఏలూరు నియోజకవర్గం నుండి ఓటరు నమోదు చేసుకోవడంతో చాలామంది ఏలూరు నియోజకవర్గం నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని అందరూ భావించారు. ఈ క్రమంలో కాకినాడ జన్మభూమి పార్కు సమీపంలో ఉన్న సిటీ పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో జనసేన పార్టీ నాయకుడు ముత్తా గోపాలకృష్ణ మాట్లాడుతు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తున్న పవన్‌ జిల్లాలో పోటీ చేయడం జిల్లాకు గర్వకారణమన్నారు. తూర్పు సెంటిమెంట్‌తో పవన్‌ జిల్లాలోని కాకినాడ రూరల్‌, కాకినాడ సిటీ, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఏదైనా ఒక అసెంబ్లీలో పోటీకి సుముఖంగా ఉన్నట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు ముత్తా గోపాలకృష్ణ.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top