అభిమానులా లేక కుటుంబమా? ఎటూ తేల్చుకోలేకున్న ఎన్టీఆర్!

By Xappie Desk, November 20, 2018 15:19 IST

అభిమానులా లేక కుటుంబమా? ఎటూ తేల్చుకోలేకున్న ఎన్టీఆర్!

అనేక నాటకీయ పరిణామాల మధ్య నందమూరి సుహాసిని కూకట్పల్లి నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్యనే ఆమె నందమూరి బాలకృష్ణతో కలిసి నామినేషన్ వేసి వచ్చారు. అప్పటిదాకా ప్రచారంలో ఉన్న పెద్దిరెడ్డిని కాదని చంద్రబాబు సుహాసినికి సీటు ఇవ్వడంపై ఉన్న అంతర్యాన్ని ఎవరైనా పసిగట్టగలరు. అయితే ఇప్పుడు జూ.ఎన్టీఆర్ పరిస్థితే ఆగమ్యగొచరంగా మారింది. ఒక వైపు అభిమానులు, మరో వైపు కుటుంబం మధ్య అతను ఎటూ తేల్చుకోలేకున్నాడు.
 
నందమూరి సుహాసిని నామినేషన్ సమయంలోనే - ఆమె బరిలోకి దిగడం ఎన్టీఆర్ కు సహా ఆయన సోదరుడైన కళ్యాణ్ రామ్ కు నచ్చలేదనే టాక్ వచ్చింది. అయితే ఈ విశ్లేషణలు ముదరడంతో..ఆమెకు శుభాకాంక్షలు తెలిపి కవర్ చేసుకునే ప్రయత్నాన్ని ఈ సోదరులిద్దరూ చేసుకున్నారు. అయితే అందులో ఎక్కడా అధ్యక్షుడయిన బాబు పేరు లేదు కాబట్టి, నందమూరి మరియు నారా వంశాలకు ఉన్న గ్యాప్ అర్థంచేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ అక్క పైన ఉన్న ప్రేమతో ప్రచారానికి దిగుతాడా లేదా అన్నది ఇక్కడ చర్చనీయాంశం.
 
టీడీపీతో సఖ్యత లేని సమయంలో...ఎన్టీఆర్ చిత్రాలని నిషేధించాలంటూ ప్రచారం జరగడాన్ని ఎన్టీఆర్ అభిమానులు ఇంకా గుర్తు చేస్తున్నారు. అలాగే హరికృష్ణ గారి మరణానంతరం, అతని మృతదేహాన్ని పార్టీ కార్యాలయానికి తీసుకెళ్లేందుకు అనుమతించలేదు అనే విషయం కూడా ప్రచారంలో ఉంది. దీనితో అభిమానులంతా, ఇప్పుడు కనుక ఎన్టీఆర్ టీడీపీ తరుపున మళ్లీ వాళ్ళ అక్క కోసం ప్రచారం చేస్తే అస్సలు ఊరుకోరు. అదీ కాకుండా అరవింద సమేత విజయోత్సవానికి వచ్చిన బాలకృష్ణ ఆ వేదికపై జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడకపోవడం పలువురిని మరింత కలచి వేసింది. మరోవైపు తమ ఇంటి ఆడబిడ్డను గౌరవించాలనే సెంటిమెంట్ ను ఇంకొందరు తెరమీదకు తెస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో తారక్ అభిమానులా లేక ఇంటి ఆడబిడ్డా…. అన్న ప్రశ్న వస్తే దేన్ని ఎంచుకుంటాడో చూడాలి.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.comTop