బాబు నుండి ఆ పత్రికలకు ఎన్ని వేల కోట్లో…! తెలిస్తే షాక్ అవుతారు.

By Xappie Desk, November 20, 2018 18:54 IST

బాబు నుండి ఆ పత్రికలకు ఎన్ని వేల కోట్లో…! తెలిస్తే షాక్ అవుతారు.

ఆంధ్రప్రదేశ్ లో ఆ పత్రికలకు ఉన్న ఆదరణే వేరు. టిడిపికి అనుకూలంగా వాళ్ళు రాసే కథనాలను చడవనిదే పచ్చ తమ్ముళ్లకు పొద్దు గడవదు. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఆ రెండు పత్రికలూ ఎంతలా కష్టపడ్డాయో అందరికీ తెలిసిందే. తమ పాఠకులకు సింగపూర్ కలలన్నింటినీ చూపించి, ఆయన రావాలి.. ఆయన వస్తేనే.. అంటూ ఒక రేంజ్లో ప్రచారం చేసి, జగన్ పైన విషం చిమ్ముతూ పాఠకులను గుడ్డివారిని చేస్తూ, ఎన్నో కట్టు కథలను కళ్ళకు కట్టినట్లు చూపించి తమ వంతుగా అనేక ఓట్లును ప్రభావితం చేసి, చివరికి బాబును అధికారంలోకి తీసుకొచ్చాయి.
 
ఇది అంతా బాబు అధికారంలోకి రాకముందు కథ. ఇప్పుడు వారు అంతకు మించి శ్రమిస్తున్నారు. బాబు అక్కిడికి వెళ్ళాడు, ఇక్కడికి వెళ్ళాడు, ఎక్కడికీ వెళ్ళకుండా అమరావతిని అద్భుతంగా నిర్మిస్తున్నాడు అంటూ పొద్దు పొద్దున్నే ఆ రెండూ పత్రికలు తెగ ఊదరగొట్టేస్తాయి. ఇక రాజధాని అమరావతి గురించి అయితే చెప్పనక్కర్లేదు. బాబు పాలనలో అద్భుతాలు జరుగుతున్నాయని.. పట్టపగలే తమ పాఠకులకు అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తూ ఉన్నాయి.
 
ఇలా అనేక అబద్ధ ప్రచారాలను ప్రింట్ చేసేందుకు ఎంత ఖర్చయింది అని ఆలోచించే వారు చాలా మంది. తెలుగుదేశం వీరాభిమానులను ఆ పత్రికలు పిచ్చివాళ్ల స్వర్గంలోకి తీసుకెళ్లిపోయాయి. అయితే.. ఈ నాలుగున్నరేళ్లలో ఆ పత్రికలు తమపై ఏమైన నమ్మకం ఉంటే దాన్ని మాత్రం పూర్తిగా కోల్పోయాయని చెప్పక్క తప్పదు. వీళ్ళు రాసే రాతల వెనుక, విలువలు, విశ్వసనీయత, నిజాలు ఉండక్కర్లేదు. అంతలా భారీ తెగించేశాయి సదరు పత్రికలు. అయితే ఏటా వీరికి గట్టిగానే ప్రతిఫలం దక్కుతోందట. ఒక తోక పత్రికకే గత నాలుగున్నరేళ్లలో ఏపీ ప్రభుత్వం నుంచి కలిగిన లబ్ధి ఏడు వందల కోట్ల రూపాయల వరకూ ఉంటుందని ఈ మాజీ సివిల్ సర్వెంట్ అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గరలో ఉండడంతో లావాదేవీలు ఇంకా జోరుగా కొనసాగుతాయి అనడంలో సందేహమే లేదు. అయితే ఇక తోక పత్రికకే ఏడు వందల కోట్లు అంటే పొద్దున్నే పాచినోటితో జనాలకు నీతులు వళ్ళించే పెద్ద దానికి ఇక వెయ్యి కోట్లు ఉండవా మరి ?
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.comTop