నందమూరి సుహాసిని నామినేషన్ తప్పులు విని ఆగ్రహం చెందిన నందమూరి కుటుంబ సభ్యులు అభిమానులు..!

By Xappie Desk, November 21, 2018 10:19 IST

నందమూరి సుహాసిని నామినేషన్ తప్పులు విని ఆగ్రహం చెందిన నందమూరి కుటుంబ సభ్యులు అభిమానులు..!

తెలంగాణ రాష్ట్రంలో రెండో అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో కుకట్పల్లి నియోజకవర్గం నుండి మహా కూటమిలో భాగమైన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దివంగత నందమూరి హరికృష్ణ తనయురాలు నందమూరి సుహాసిని పోటీకి దిగుతున్న విషయం మనకందరికీ తెలిసినదే. ఈ నేపథ్యంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ తరఫున కుకట్ పల్లి నియోజకవర్గం నుండి పోటీకి తగ్గదు నామినేషన్ వేసిన ప్రక్రియ నందమూరి కుటుంబ సభ్యులకు మరియు అభిమానులకు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇంతకి విషయం ఏమిటంటే కుకట్ పల్లి నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నట్లు గా వేస్తున్న నామినేషన్ లో నందమూరి సుహాసిని నందమూరి హరి కృష్ణ తనయురాలు అని ఉండాల్సిన చోటులో అది కొట్టివేసి హరి కృష్ణ యొక్క భార్య గా రాసి నామినేషన్ వేసినట్టు తెలుస్తుంది. ఇది ఒక్కటే కాకుండా అచ్చు ఇలాగే మళ్ళీ ఓటర్ల జాబితాలో కూడా ఇలాగే ఉన్నట్టు తెలుస్తుంది. దీనితో నందమూరి అభిమానులు ఒక్కసారిగా విస్మయానికి గురయ్యారు. అసలు నామినేషన్ లోనే ఇన్ని తప్పులు ఉండటం ఏమిటి అని సోషల్ మీడియాలో తెగ కామెంట్లు చేస్తున్నారు. ఇదే క్రమంలో ప్రత్యర్థి పార్టీల నాయకులు కనీసం నామినేషన్ వేయలేని అభ్యర్థి రాజకీయాల్లో ఏమి రాణిస్తుందని విమర్శిస్తున్నారు. దీంతో ఈ విషయం 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com


Top