దమ్ముంటే హత్యాయత్నం కేసు గురించి రాష్ట్రపతికి ఫిర్యాదు చేయండి బాబు కి సవాల్ విసిరిన జగన్..!

దమ్ముంటే హత్యాయత్నం కేసు గురించి రాష్ట్రపతికి ఫిర్యాదు చేయండి బాబు కి సవాల్ విసిరిన జగన్..!

వైసీపీ అధినేత జగన్ చేస్తున్న ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రస్తుతం విజయనగరం జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో జరిగిన మహాసభలో వైసీపీ అధినేత జగన్ ఏపీ సీఎం చంద్రబాబు పై విశాఖపట్టణం విమానాశ్రయంలో తనపై జరిగిన హత్యాయత్నం విషయంలో సంచలన కామెంట్ చేశారు.
 
ఆపరేషన్ గరుడ అంటూ తనను మట్టుపెట్టేందుకు చంద్రబాబు రాష్ట్రంలో సరికొత్త డ్రామా ఆడారని పేర్కొన్నారు. ఆపరేషన్ గరుడపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసే దమ్ముందా అంటూ సవాల్ విసిరారు. ఆపరేషన్ గరుడ పేరుతో ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోందని అంటున్న చంద్రబాబు ఎందుకు ఫిర్యాదు చెయ్యడం లేదని నిలదీశారు. ఆపరేషన్ గరుడపై విచారణ జరిపితే అసలు గుట్టు బయటపడుతుందన్నారు. ఇటువంటి చంద్రబాబు విభజన తో నష్టపోయిన ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో సమస్యలు సృష్టించి రాష్ట్రంలో అనేక సమస్యలు ఉంటే పక్క రాష్ట్రాలకు వెళ్లి దేశాన్ని కాపాడుదాం అని అనడం సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు జగన్.
 
రాష్ట్రంలో అనేక సమస్యలు ఉంటే వాటిపై కోర్టులకు వెళ్లరు కానీ ఐటీసోదాలు జరిగితే మాత్రం చంద్రబాబు సుప్రీంకోర్టుకు వెళ్తారంటూ ధ్వజమెత్తారు. తిత్లీ బాధితులను ఆదుకోవడం కంటే పబ్లిసిటీకే ఎక్కువ సమయం కేటాయించారని దుయ్యబుట్టారు. ప్రస్తుతం రాష్ట్రం కరువుతో అలమటిస్తున్న ముఖ్యమంత్రి అయి ఉండి ప్రజా సొమ్ముతో ప్రత్యేక విమానాలలో పర్యటించడం దారుణమని..మరియు రాష్ట్రంలో అగ్రిగోల్డ్ చేతులలో ఎంతోమంది మోసపోయిన కేసును కుట్రపూరితంగా కొట్టేయాలని చంద్రబాబు ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్నారని జగన్ ఆరోపించారు.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top