జగన్, పవన్ ల పై సంచలన ఆరోపణలు చేసిన ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి..!

జగన్, పవన్ ల పై సంచలన ఆరోపణలు చేసిన ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి..!

2014 ఎన్నికలలో ఆంధ్రరాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కనీసం డిపాజిట్ కూడా దక్కలేకపోయింది. అయితే రాబోతున్న ఎన్నికలలో టిడిపి తో జత కట్టి పబ్బం గడపాలని గతంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓటు బ్యాంక్ తిరిగి పొందాలని ఏపీలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తరఫున అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది కాంగ్రెస్ అధిష్టానం.
 
ఈ క్రమంలో ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 72% మంది రాహుల్ గాంధీ ప్రధాని అవ్వాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. మరియు అదే విధంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లపై నిప్పులు చెరిగారు. మోదీ, కేసీఆర్‌కు జగన్‌, పవన్‌ ఏజెంట్లు అంటూ ఘాటుగా విమర్శించారు. బీజేపీకి టీఆర్ఎస్ బీ టీమ్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఏ పార్టీకి మద్దతిస్తారో జగన్, పవన్ చెప్పగలరా? అని నిలదీశారు. అసెంబ్లీకే పోటీ చేయలేనివారు పార్లమెంట్‌కు పోటీ చేస్తారా? అని నిలదీశారు. తెలంగాణలో పోటీ చెయ్యలేనివారు ఏపీ అసెంబ్లీకి మాత్రం పోటీ చేయడం ఎందుకు? అంటూ చురకలు వేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో పొత్తులపై డిసెంబర్ 15 తర్వాత ఓ నిర్ణయం వెలువడొచ్చని రఘువీరా అభిప్రాయపడ్డారు.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top