బాలకృష్ణ ఇంటిని ముట్టడించిన పారిశుధ్య కార్మికులు…!

బాలకృష్ణ ఇంటిని ముట్టడించిన పారిశుధ్య కార్మికులు…!

తెలుగుదేశం పార్టీ నాయకుడు హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ ఇంటి ఎదుట పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనలు నిర్వహించారు. ఇటీవల చంద్రబాబు ప్రభుత్వం 220 మంది పారిశుద్ధ్య కార్మికులను విధులు నుండి తొలగించడం జరిగింది. దీంతో పారిశుధ్య కార్మికులు చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాలకృష్ణ ఇంటిని చుట్టుముట్టారు. ఈ క్రమంలో హిందూపురంలో బాలకృష్ణ ఇంటి ఎదుట పారిశుద్ధ్య కార్మికులు బైఠాయించి తమ ఆందోళనలు నిరసనలు వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య కార్మికులను తొలగిస్తూ ఇచ్చిన జీవో 279 రద్దు చేయాలంటూ పేర్కొన్నారు. తమ సమస్య తీరే అంత వరకు ఇక్కడ నుండి కదలమంటు అందరూ ఒకే మాటపై ఉండటంతో ఉండి చుట్టుపక్కల ఉన్న చెత్త మొత్తం తీసుకువచ్చి,,బాలకృష్ణ ఇంటి ముందు వేసి వారి ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనను విరమించే ప్రయత్నాలు చేశారు.
 
ఈ క్రమంలో కార్మికులకు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది.ఈ తోపులాటలో పలువురు కార్మికులు గాయాలపాలయ్యారు. ఈ ఆందోళనలో పాల్గొన్న సీఐటీయూ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఈ విషయం మొత్తం సోషల్ మీడియాలో రావడంతో చంద్రబాబు ప్రభుత్వం పై చాలా మంది నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. రాష్ట్రంలో చెత్తను శుద్ధిచేసే పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు తీర్చలేని వ్యక్తి దేశాన్ని కాపాడటం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్ళటం సిగ్గుచేటు అంటూ దారుణంగా చంద్రబాబు ప్రభుత్వం పై కామెంట్లు చేస్తున్నారు.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top