రేవంత్ ఛాలెంజ్ కి కుదేలైపోయిన కేసీఆర్..!

By Xappie Desk, November 21, 2018 12:18 IST

రేవంత్ ఛాలెంజ్ కి కుదేలైపోయిన కేసీఆర్..!

ఎన్నికల ముందు టిఆర్ఎస్ పార్టీని గ్రూపు రాజకీయాలు రచ్చకి ఇడుస్తున్నాయి. గతంలో ముందస్తు ఎన్నికలు ప్రకటించిన నేపథ్యంలో కేసీఆర్ అదే సమయంలో అభ్యర్థులు ప్రకటించడంతో అనేక చోట్ల టిఆర్ఎస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయి..ఈ క్రమంలో చాలా మంది టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు బహిరంగంగానే టిఆర్ఎస్ అధిష్టానం పై కామెంట్స్ చేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి.
 
ఈ నేపథ్యంలో ఎన్నికలకు కొద్ది రోజులు ఉండగా తాజాగా చేవెళ్ల ఎంపీ విశేశ్వర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేయడం పార్టీలో తీవ్ర కలకలాన్ని రేపింది. గత పార్టీ మారతారనే వార్తలు జోరుగానే సాగుతున్నా గులాబీ నేతలు మాత్రం అదేం లేదని బుకాయిస్తూ వచ్చారు. కానీ ఇటీవల ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా విశేశ్వర్ రెడ్డి లాంటి బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న నేత పార్టీని వీడటం, అదీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందే ఇలా జరగడంతో కేసిఆర్ ను సందిగ్ధంలో పడేసింది. విశేశ్వర్ రెడ్డి గత కొన్నాళ్లుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అంతేకాదు నేతలంతా ప్రచారంలో పాల్గొంటుంటే ఆయన మాత్రం రోడ్డెక్కిన దాఖలాలు లేవు. తన సొంత జిలాల్లో తనను కాదని మంత్రి మహేందర్ రెడ్డికి ఎక్కువ ప్రాధాన్యమివ్వడమే విశేశ్వర్ రెడ్డి రాజీనామాకు కారణమని తెలుస్తోంది. మరో పక్క కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి గత కొద్ది రోజుల క్రితమే టిఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎంపీలు కాంగ్రెస్ పార్టీలో రాకుండా కేసిఆర్ చూసుకోవాలని చాలెంజ్ విసిరారు..ఇటువంటి తరుణంలో ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేయడంతో టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సందిగ్ధంలో పడిపోయారు.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.comTop