మోదీకి అంత సీన్ లేదు..! – కేటీఆర్

By Xappie Desk, November 21, 2018 14:16 IST

మోదీకి అంత సీన్ లేదు..! – కేటీఆర్

తెలంగాణలో ఎన్నికల ఢంకా మోగించి. తన సొంత నియోజకవర్గమైన సిరిసిల్లలో ఒకవైపు ప్రచారం చేసుకుంటూనే, మరో వైపు మీడియాతో ఇతర కేంద్ర పార్టీల పైన నిప్పులు చిమ్ముతున్నాడు, తెలంగాణా ఐ.టీ మంత్రి కేటీఆర్. ఇప్పుడు ఆయన గ్రేటర్ లో స్టార్ క్యాంపెయినర్ గా గులాబీ పార్టీ గెలుపును తన భుజాల మీద ఎసుకున్నారు. ఈ మధ్య అమిత్ షా తెలంగాణ లో ముందస్తు ఎన్నికల మీద చేసిన కామెంట్స్ కు ఆయన స్పందించారు. పలు బీజేపీ నేతలపై ఆయన సెటైర్లు వేసారు.
 
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజాదరణకు భయపడే తెలంగాణలో టీఆర్ ఎస్ ముందస్తు ఎన్నికలకు వెళ్లిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో పాటు ఆ పార్టీ నాయకులు తరచూ వ్యాఖ్యానించడం చిత్రంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. తమ రాష్ట్రంలో ఆయనకు అంత సీన్ లేదని తేల్చి చెప్పేశారు. మోదీకి తెలంగాణలో ఉన్న ప్రజాదరణకు భయపడే తాము ముందస్తు ఎన్నికలకి వెళ్లానని అనడంలో ఏమాత్రం నిజం లేదని అన్నారు. అసలు పక్క పార్టీల మీద పడి ఏడవకుండా, దేశవ్యాప్తంగా మోదీకి ఎందుకు వ్యతిరేకత వస్తుందో పరిశీలించుకోవాలి అని ఎద్దేవా వేశారు.
 
తెలంగాణలో బీజేపీకి ఉనికిలేదని - దీనిపై కాంగ్రెస్ అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నదని విమర్శించారు. బీజేపీ - కాంగ్రెస్ లకు టీఆర్ ఎస్ వ్యతిరేకమని - రాష్ట్రాన్ని పాలించుకునే సమర్థత టీఆర్ ఎస్ కు ఉన్నదని స్పష్టంచేశారు. ఇదే క్రమంలో ఆయన జాతీయ రాజకీయాల పైన కూడా స్పందించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నీ రాష్ట్రాల్లో జాతీయ పార్టీల కన్నా ప్రాంతీయ పార్టీలే పైచేయిలో ఉన్నాయని అన్నారు. జాతీయ పార్టీలే ప్రాంతీయ పార్టీల మద్దతు కోరుకునే రోజులు వస్తాయన్నారు. వారసత్వ రాజకీయాలు - కుటుంబపాలన గురించి మాట్లాడే అర్హత రాహుల్ కు లేదని ఇలాంటి రాజకీయాల ద్వారా అందరికంటే ఎక్కువగా లాభపడుతున్నది ఆయనేనని ఎద్దేవా చేశారు. అసలు ఆయనకి కుటుంబ మద్దతు లేకుండా పార్టీ ప్రెసిడెంట్ గా ఉండేందుకు అసలు ఏమి అర్హత ఉందని సూటిగా ప్రశ్నించారు. అక్కడ తండ్రి టీడీపీని తగులుకుంటే ఇక్కడ కొడుకు జాతీయ పార్టీల పని పడుతూ ఎన్నికలకు మంచి వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.comTop