ఎక్స్ క్లూజివ్ : పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ స్పీచ్ - ఏం చెప్పాడు - ఎవరిని టార్గెట్ చేసాడు ? !

By Xappie Desk, November 21, 2018 15:52 IST

ఎక్స్ క్లూజివ్ :  పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ స్పీచ్ - ఏం చెప్పాడు - ఎవరిని టార్గెట్ చేసాడు ? !

చెన్నై లో పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ అంటూ గత నలభై ఎనిమిది గంటలుగా సోషల్ మీడియా మారు మోగింది . ఆంధ్ర ప్రదేశ్ పార్టీ అయినటువంటి జనసేన కి ప్రెసిడెంట్ గా ఉన్న పవన్ కళ్యాణ్, తెలుగు హీరో అయినటువంటి పవన్ కళ్యాణ్ అక్కడ చెన్నై లో ప్రెస్ మీట్ ఏంటి అంటూ అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఇది ఎలాంటి పరిణామాలకి దారి తీస్తుంది అనే విషయం లో కూడా ఆసక్తిగా ఎదురు చూసారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ లో తనదైన శైలి లో మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ ప్రెస్ మీట్ లో అతిపెద్ద ఆసక్తికర సంఘటన ఏంటంటే పవన్ తమిళ్ లో కూడా మాట్లాడడం. కేవలం తాను చెప్పేది మాత్రమే చెప్పడం కాకుండా పాత్రికేయులు అడిగే ప్రశ్నలకి కూడా చక్కగా సమాధానం చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్. ఎవ్వరూ ఊహించని ప్రకటన కూడా చేసాడు .. ముందుగా పవన్ కళ్యాణ్ తాను ఎందుకు బీజేపీ తో సపోర్ట్ గా నిలిచాడో , టీడీపీ కి ఎందుకు సపోర్ట్ చెయ్యాల్సి వచ్చిందో చెప్పుకొచ్చాడు. ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతం లో విపరీతమైన కరప్షన్ మొదలైంది అనీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ తో పాటు , ఇసక మాఫియా విషయం లో కరప్షన్ జరుగుతోంది అని చెప్పుకొచ్చాడు. " నేను చెన్నై కి ఎందుకు వచ్చాను అంటే .. ఒక పొలిటికల్ పార్టీగా అనేక ప్రాంతాలకి వెళుతూ ఉంటాను నేను. కానీ పక్క రాష్ట్రాల విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చెయ్యము. సౌత్ ఇండియన్ పొలిటికల్ లీడర్స్ ని కలవడానికి వచ్చాను . జనసేన ని సౌత్ ఇండియా మొత్తం పరిచయం చెయ్యడానికి వచ్చాను. భవిష్యత్తు రాజకీయం రీజనల్ పాలిటిక్స్ చుట్టూ తిరిగుతుంది కాబట్టి నేను ఇది మొదలు పెడుతున్నాను. నేను పోలాచ్చి లో సినిమా షూటింగ్ లో పాల్గొన్న టైం లో కుర్రాళ్ళ యొక్క కోపాన్ని బీజేపీ పట్ల చూసాను. సోషల్ నెట్వర్కింగ్ మూలంగా ఆ కోపం పెరిగింది. జల్లి కట్టు ఉద్యమం నిజంగా కుర్రాళ్ళ దమ్ము చూపించింది. సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం యువత కష్టపడుతున్న స్టైల్ చాలా గొప్పగా కనిపించింది. బీజేపీ అయినా, నేషనల్ పార్టీ కాంగ్రెస్ అయినా ఇద్దరి మీదా జనం కోపంగా ఉన్నారు. రీజనల్ పాలిటిక్స్ కోసం జనం ఎగబడుతున్నారు. చిన్న చిన్న ప్లేయర్స్ ని కూడా జనసేన పార్టీ అప్రోచ్ అవుదాం అని కోరుతోంది. కలక్తివ్ గా కలిసి పని చేస్తే మంచి ఆలోచన తో ముందుకు వెళ్ళచ్చు అని మా పార్టీ నేను నమ్ముతున్నాను. రాష్ట్ర విభజన చట్టం మాకు అన్యాయం చేసింది - మేము కోరిన ప్రతీ కోరిక తీర్చాల్సి ఉంది (చట్టం లో ఉన్నవి) . జనసేన ఇతర పార్టీ లతో పోలిస్తే చాలా కొత్తగా గేమ్ ఆడే ప్రయత్నం చేస్తోంది. నార్త్ ఇండియా వాళ్ళ యొక్క డామినేషన్ ఎక్కువగా ఉంది. రాజకీయ నాయకులు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం పట్ల దక్షిణ భారతీయలు హార్ట్ అయ్యి ఉన్నారు . దక్క్షిణ భారత దేశం లో ఒక స్పెషల్ క్యాపిటల్ ని కోరుతున్నారు కొందరు. దక్షిణ భారతం యొక్క మనసుల్ని అర్ధం చేసుకుని మా బాధలని అర్ధం చేసుకోవాలని కోరుతున్నాం. అనేక రాష్ట్రాలు తిరగబోతున్నాను " అని ముగించారు పవన్ కళ్యాణ్.
 
ఈ ప్రకటన తో సౌత్ ఇండియా మొత్తాన్నీ తనవైపు తిప్పుకున్నాడు పవన్ అనే మాట వినిపిస్తోంది. కొత్త తరహా రాజకీయం తో యువత ని కలుపుతూ చిన్న - పెద్ద పార్టీలు అన్నీ కలవాలి అని కోరుతున్నాడు పవన్ కళ్యాణ్.Top