జగనే కాబోయే సీఎం అట... సర్వే చెప్పిన సరికొత్త నిజం !

జగనే కాబోయే సీఎం అట... సర్వే చెప్పిన సరికొత్త నిజం !

వినడానికి వింతగా ఉండొచ్చు కానీ ఇక్కడ జరుగుతున్న తంతు మాత్రం అదే. రాబోయే ఎన్నికల్లో జగన్ మంచి మెజారిటీతో విజయం సాధిస్తాడని జగన్ తరపు మీడియా వర్గాల్లో తాజాగా బయటకు వచ్చిన ఒక సర్వే చెబుతోంది. ఇటువంటి పిచ్చాపాటి సర్వేలు ఎన్నికలు దగ్గర ఏ సమయంలో చాలా కామన్. ఈ మధ్యనే జనసేన 130 పైన స్థానాల్లో విజయం సాధిస్తుందని ఫేస్ బుక్ వాల్ పై న చక్కర్లు కొట్టింది ఒక సర్వే. అది ఏకంగా లగడపాటి అంచనా అని ఊదరగొట్టేశారు కూడా. ఇలాంటిదే తాజాగా ఇప్పుడు మరొక సర్వే వివరాలు బయటకు వచ్చాయి.
 
ఈ సర్వే చెబుతున్న ప్రకారం జగన్ గెలిచేందుకు అవకాశాలు చాలానే ఉన్నాయట. దీనికి పవన్ కళ్యాణ్ మరియు బిజెపి కారణంగా చీలే ఓట్లు ఒక కారణం కాగా ఇంకొకటి ఒంటరిగా పోటీ చేయలేని చంద్రబాబు అసమర్థత అని ఈ సర్వే చెబుతోంది. అంతటితో ఆగితే ఎలా, కాస్త ముందుకు వెళితే ఈ సర్వేలో పవన్ కల్యాణ్ ప్రబావం పెద్దగా లేదు అంటూనే, ఆ పార్టీ సింగిల్ డిజిట్ సీట్లకే పరిమితం కాక తప్పదు అని తెలుస్తుంది. అయితే అదే క్రమంలో పవన్ మరియు బీజేపీ ఎఫెక్ట్ టీడీపీపై పడి బాబు ఓడిపోతాడట. ఫలితంగా గెలుపు జగన్ దే నట.
 
అయితే ఈ సర్వే బయటకు చెప్పిన వాడికి కూడా ఈ సర్వే ఎవరు చేశారో తెలియదు. జగన్ అనుకూల మీడియా వర్గాలు ఇటువంటి సర్వే లు చేస్తూ ఈసారి జగన్ దే అధికారమని తేల్చి చెప్పేశారు. మొత్తంగా చూసుకుంటే 2019 విజేత‌గా వైఎస్సార్ కాంగ్రెస్ నిల‌వ‌నుంది అంటూ ఊదర కొడుతున్న జగన్ పెయిడ్ మీడియా కాస్త నిద్ర లేచి, కలల్లో నుంచి బయటకు వచ్చి ప్రపంచాన్ని చూస్తే మంచిది అన్నది రాజకీయ విశ్లేషకుల వాదన. ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ఇటువంటి స్టేట్మెంట్లు అవతలి వారికి హాస్యాస్పదంగా అనిపించినా, వైసిపి కార్యకర్తల్లో మాత్రం ఎనలేని ఉత్సాహాన్ని నింపుతుంది అనే చెప్పాలి.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top