నా చివరి రక్తపు బొట్టు వరకు కట్టె కాలే అంతవరకు వైసీపీ లోనే ఉంటా : వైసీపీ ఎమ్మెల్యే

నా చివరి రక్తపు బొట్టు వరకు కట్టె కాలే అంతవరకు వైసీపీ లోనే ఉంటా : వైసీపీ ఎమ్మెల్యే

వైసిపి నేత ప్రతిపక్ష నేత జగన్ విజయనగరం జిల్లాలో చేస్తున్న ప్రజా సంకల్ప పాదయాత్ర కి జనం నుండి అద్భుతమైన ఆదరణ లభిస్తుంది. జగన్ ఎక్కడా అడుగుపెట్టిన జనం బ్రహ్మరథం పడుతున్నారు..తమ కష్టాలను చెప్పుకుంటూ ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం తమ పట్ల ఏ విధంగా వ్యవహరిస్తుందో ప్రతి విషయాన్ని పూసగుచ్చినట్లు జగన్ కి తెలియజేయడంతో జగన్ తన దృష్టికి వస్తున్న ప్రతి సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తూ ప్రజలకు ధైర్యం చెబుతూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో విజయనగరం జిల్లా ప్రజా సంకల్ప పాదయాత్రలో భాగంగా కురుపాంలో జరిగిన బహిరంగ సభలో వైసీపీ ఎమ్మెల్యే పుష్ప శ్రీ వాణి మాట్లాడుతూ వైసిపి పార్టీ పై మరియు జగన్ పై చేసిన కామెంట్లు అక్కడ ఉన్న సభికులను చప్పట్లు కొట్టే విధంగా చేసింది.
 
ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ నుండి బయటకు రావాలంటే అనేకసార్లు ప్రలోభాలకు గురి చేశారు అంటూ..పాలన విషయంలో అనేక ఇబ్బందులు పెట్టారు అన్ని కామెంట్లు చేశారు. అయితే రాష్ట్ర భవిష్యత్తు విషయమై రాష్ట్రంలో నియోజకవర్గంలోని ప్రతి పేదవాడు సామాన్యుడు నిర్భయంగా బ్రతకాలంటే జగన్ మాత్రమే ఆ పని చేయగలరని కనుక అధికార పార్టీ టిడిపి ఎన్ని ఇబ్బందులు పెట్టినా పార్టీని వీడానని చివరి వరకు రాజకీయాలలో జగన్ వెంట నడుస్తానని..నా చివరి రక్తపు బొట్టు వరకు కట్టే కాలే అంతవరకు వైసీపీ పార్టీలో ఉంటానని..ప్రస్తుతం రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రతి సామాన్యుడు తెలుసుకుంటున్నారని రానున్న రోజుల్లో జగన్ ముఖ్యమంత్రి అయితే కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని గర్వంగా తెలియజేశారు కురుపాం వైసీపీ ఎమ్మెల్యే పుష్ప శ్రీ వాణి. దీంతో పుష్ప శ్రీవాణి చేసిన వ్యాఖ్యలకు అక్కడ ఉన్న ప్రాంతంలో ప్రజలంతా చప్పట్లతో సభను హోరెత్తించారు
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top