జగన్ చేసిన ప్రసంగానికి సభలోనే ఏడ్చేసిన వైసీపీ ఎమ్మెల్యే..!.

జగన్ చేసిన ప్రసంగానికి సభలోనే ఏడ్చేసిన వైసీపీ ఎమ్మెల్యే..!.

వైసీపీ అధినేత జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రలో భాగంగా విజయనగరం జిల్లాలో కుర‌పాం లో జగన్ ప్రసంగానికి కుర‌పాం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే పుష్ప శ్రీ వాణి కంటతడి పెట్టారు. కుర‌పాం లో జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం పై మరియు టిడిపి నాయకుల పై అనేక విమర్శలు చేశారు..ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ లేకుండా చంద్రబాబు అనేక కుయుక్తులు పన్నారని వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను సంతలో పశువుల కొన్నట్లు కొన్నారని ఇటువంటి సమయంలో తెలుగుదేశం పార్టీ నుండి అనేక ఒత్తిల్లు వచ్చిన కుర‌పాం నియోజకవర్గం మీ ఎమ్మెల్యే మా పార్టీ అభ్యర్థి పుష్ప శ్రీ వాణి ఎక్కడ బెదరకుండా లొంగకుండా నిజాయితీ రాజకీయాలు చేస్తూ మీరు ఇచ్చిన తీర్పును కాపాడుతూ ప్రజాస్వామ్యానికి అసలైన అర్థం చెబుతూ రాజకీయాల్లో రాణిస్తున్నారని. ఇటువంటి మీ ఎమ్మెల్యే పుష్ప శ్రీ వాణి నాకు చెల్లెలు తో సమానం అని. రాజకీయాలలో చిన్న‌వారైనా పుష్ప శ్రీవాణి, ఆమె భ‌ర్త ప‌రీక్షిత్ రాజు ఎలాంటి ప్ర‌లోభాల‌కు లొంగ‌కుండా విలువ‌ల‌తో కూడిని రాజ‌కీయం చేశార‌ని. దీంతో ఈ ఇద్ద‌రు త‌న మన‌సులో ఎప్ప‌టికీ నిల‌చిపోతార‌ని జ‌గ‌న్ అన్నారు. దీంతో జగన్ చేసిన కామెంట్లతో పక్కనే ఉన్న ఎమ్మెల్యే శ్రీవాణి భావోద్వేగానికి లోనై బహిరంగ సభ లోనే కంటతడి పెట్టారు. కచ్చితంగా రానున్న రోజుల్లో విజ‌య‌న‌గ‌రం జిల్లా కుర‌పాం నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తాం అని జగన్ ప్రజలకు హామీ ఇచ్చారు.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.comTop