మీరు తినేది ఆడ కోడా? మగ కోడా? తెలుసుకొకపోతే చాలా నష్టం !

By Xappie Desk, November 22, 2018 10:48 IST

మీరు తినేది  ఆడ కోడా? మగ కోడా? తెలుసుకొకపోతే చాలా నష్టం !

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు  పౌల్ట్రీ వ్యాపారులకు నోటీసులు జారీ చేసింది. అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా కోళ్లను చంపి వ్యర్థాలను ఇష్టానుసారంగా పడవేయడంపై  పౌల్ట్రీ వ్యాపారులకు మరియు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఇట్టివల పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ (పెటా) ఇలాంటి పనులు చేస్తున్న పౌల్ట్రీ పరిశ్రమ గురించి హైకోర్టులో ఓ పిల్ దాఖలు చేసింది. దీంతో స్పందించిన హైకోర్టు వెంటనే సదరు వ్యాపారులకు మరియు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు నోటీసులు అందజేసి..పౌల్ట్రీ వ్యాపారులకు షాక్ ఇచ్చింది. ముఖ్యంగా పౌల్ట్రీ ఫారాలలో  మగ కోళ్లను చంపేసి వాటి వ్యర్ధాలను ఇష్టానుసారంగా వివిధ వ్యాపారాలకు పొలాల్లో ఎరువుగా నిర్జన ప్రదేశాల్లో వాడుతున్నారని..దీనివల్ల వ్యాధులు సోకే ప్రమాదం ఉందని పిటీషన్ లో పేర్కొన్నారు. మరియు అదే విధంగా  ఆడకోళ్లను గుడ్ల కోసం పెంచుతూ వాటి మాంసాన్ని వ్యాపారం కోసం అమ్ముకుంటున్నారని.. మగ కోళ్లను పెంచడం లేదని పెటా పిటీషన్ లో ఆరోపించింది. చికెన్ తినే వినియోగదారులందరికీ వాటి తయారీ - ఏ ఏ చికెన్ ను సరఫరా చేస్తున్నారనే విషయాలను తెలుసుకునే హక్కు ఉందని పెటా హైకోర్టులో కోరింది. అవి మాంసం కోసం వినియోగించే మగ కోళ్లా? ఆడకోళ్లో తెలిసేలా చికెన్ వ్యాపారులను ఆదేశించాలని.. వినియోగదారులకు అవగాహన కల్పించాలని పెటా ప్రతినిధి కోరారు.Top