బాబు కి ఏజ్ అయిపోయింది ఇక ఏపీలో భవిష్యత్తు మాదే అని తేల్చేసిన పవన్ కళ్యాణ్..!

By Xappie Desk, November 22, 2018 11:33 IST

బాబు కి ఏజ్ అయిపోయింది ఇక ఏపీలో భవిష్యత్తు మాదే అని తేల్చేసిన పవన్ కళ్యాణ్..!

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల చెన్నై పర్యటనలో నిర్వహించిన మీడియా సమావేశం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. చెన్నై లో విలేకరులతో పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం చంద్రబాబు పై మరియు జనసేన పార్టీ భవిష్యత్తు పై సంచలన కరమైన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ను ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. చెన్నై లో విలేకరులతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు కి వయసు అయిపోయిందని..రానున్న కాలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవిష్యత్తు మొత్తం జనసేన పార్టీ దేనని స్పష్టం చేశారు.
 
చంద్రబాబు జాతీయ నాయకులతో కలుస్త కూటమి పెడదామని భావిస్తున్న నేపద్యం లో చంద్రబాబుతో మీరు కలుస్తారా అన ప్రశ్నకు..బాబుతో రాజకీయాలు చేసే ప్రసక్తే లేదని..అలా ఇప్పుడు చేస్తే ప్రమాదకరమైన రాజకీయ ప్రయాణం అవుతుందని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. రాజకీయాలలో తెలిపారు. చంద్రబాబు రిటైర్మెంట్ తీసుకుంటారని అందువల్లే తన కుమారుడిని దొడ్డిదారిన మంత్రిని చేశారని విమర్శించారు. చంద్రబాబు తనయుడు పంచాయతీ ఎన్నికల్లో కూడా గెలవలేడని అలాంటిది ఆయనను పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిని చేశారన్నారు. నామినేటెడ్ పదవిచ్చి పంచాయితీరాజ్ శాఖకు అధిపతిని చేశారంటూ వ్యంగ్యంగా విమర్శించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉందని స్పష్టం చేశారు . రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఏపీ రాష్ట్రంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top