రేవంత్ ఇలాఖా లో తిరుగులేని కేటీఆర్ !

By Xappie Desk, November 22, 2018 12:03 IST

రేవంత్ ఇలాఖా లో తిరుగులేని కేటీఆర్ !

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల తెలంగాణ మంత్రి కేటీఆర్ రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం లో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా త్వరలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్..రేవంత్ రెడ్డి పై చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. రేవంత్ రెడ్డి మీడియా ముందు ఫోజులు ఇవ్వడం తప్ప తెలంగాణ రాష్ట్రంలో చేసింది ఏమీ లేదని టిఆర్ఎస్ పార్టీ వచ్చాక తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన అభివృద్ధి జరిగిందని ఈ అభివృద్ధి కొనసాగాలంటే పట్నం నరేందర్ రెడ్డి గెలిపించుకోవాలని..ప్రస్తుతం సభా ప్రాంగణంలో ప్రజల ఆదరణ చూస్తుంటే ఆల్రెడీ టిఆర్ఎస్ పార్టీ ఇక్కడ గెలిచినట్లు ఉందని..మీరు నరేందర్ రెడ్డి మీద చూపిస్తున్న అభిమానాన్ని బట్టి రానున్న ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం లో టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని మీ స్పందన చూస్తుంటే తెలుస్తుందని పేర్కొన్నారు.
 
``ఆ గట్టు మీద కరెంటు అడిగితే కాల్చి చంపిన కాంగ్రెస్ - టీడీపీ ఉంది.. ఈ గట్టు మీద 24 గంటల కరెంటు ఇచ్చిన టీఆర్ఎస్ ఉంది. ఆ గట్టు మీద మాటల నాయకుడు రేవంత్ రెడ్డి ఉన్నడు.. ఈ గట్టు మీద చేతల నాయకుడు పట్నం నరేందర్ రెడ్డి ఉన్నడు.." అని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ``పట్నం నరేందర్ రెడ్డిని కారులో అసెంబ్లీకి పంపించండి. అభివృద్ధి బాధ్యత మేమేం తీసుకుంటాం. కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డికి దమ్ముంటే టీఆర్ ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి పై గెలవాలి...అంటూ సవాల్ విసిరారు. మరియు అదే విధంగా టిఆర్ఎస్ పార్టీ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రాకపోతే కచ్చితంగా రాజకీయ సన్యాసం తీసుకుంటా..కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే యువ రాజకీయ సన్యాసం తీసుకునే దమ్ము ఉందా అంటూ రేవంత్ రెడ్డికి సవాలు విసిరారు కేటీఆర్. దీంతో కేటీఆర్ చేసిన కామెంట్లు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు పెద్ద హాట్ టాపిక్ గా మారాయి.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.comTop