ప్రగతి భవన్ ఆసుపత్రి బోర్డు రెడీ చేసిన చంద్రబాబు!

By Xappie Desk, November 22, 2018 19:16 IST

ప్రగతి భవన్ ఆసుపత్రి బోర్డు రెడీ చేసిన చంద్రబాబు!

తెలంగాణ ఎన్నికల్లో కేవలం 13 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ టిడిపి ఆసక్తికరమైన మరియు ఆకర్షణీయమైన మేనిఫెస్టో విడుదల చేసింది. ఇందులో అందరినీ ఆకట్టుకున్నది ఏమిటంటే, సీఎం నివాసం గా ఉంటున్న ప్రగతి భవన్ ను ఆసుపత్రిగా మారుస్తామని హామీ ఇవ్వడమే. ఈ ప్రగతి భవన్ ను కెసిఆర్ సీఎం అయిన తర్వాత ప్రత్యేకంగా నిర్మించారు. దీని నిర్మాణం కోసం మూడు వందల కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టారు. దీని లోపల ఎలా ఉంటుందో ఎవరికి ఇప్పటి వరకు తెలియని కూడా తెలీదు కనీసం ఫోటోలు కూడా అందుబాటులో లేవు. ఎమ్మెల్యే నందు లోకి తీసుకు వెళ్తానని చెప్పారు కానీ ఇప్పటికీ అలాంటిది జరగలేదు.
 
అయితే ఇలాంటి భవనాన్ని తాము ఆసుపత్రిగా మార్చేస్తామని టిడిపి తమ మేనిఫెస్టోలో పేర్కొనడం చాలా ఆసక్తికరం. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానం అమలు, ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల సంక్షేమానికి చర్యలు తీసుకుంటామన్నారు. రూ. 2 లక్షల వరకు రైతు రుణమాఫీ, కౌలు రైతులకూ మాఫీ వర్తింపు, కుటుంబంలో ఒక్కో సభ్యుడికి 7 కేజీల చొప్పున రేషన్‌ బియ్యం, ఎస్సీ వర్గీకరణ, ఎస్సీ, ఎస్టీలకు సబ్‌ప్లాన్‌, బీసీలకు సబ్‌ప్లాన్‌ కూడా అమలు చేస్తామని టీ టీడీపీ ప్రకటించింది. అలాగే మహాకూటమిలోని పక్షాలన్నీ విడివిడిగా మ్యానిఫెస్టోలు విడుదల చేస్తున్నాయి. అయితే మూకుమ్మడిగా విడుదల చేసే ఒక ప్రణాళిక మరో రెండు రోజుల్లో రానుందని తెలుస్తోంది. దీనికి కోదండరాం చైర్మన్గా ఉన్నారు.
 
ఇంకా తెలంగాణ టీడీపీ మ్యానిఫెస్టో లో, అమరవీరులకు ప్రత్యేక స్థానాన్ని కల్పించారు. అమరవీరుల ఇంటికి ఒక ఉద్యోగాన్ని మరియు ఇంటిని ఇస్తామని చెప్పారు. అన్ని జిల్లాల్లో పూలే, అంబేద్కర్‌ నాలెడ్జ్‌ సెంటర్లు, ప్రొ. జయశంకర్‌ పేరుతో విద్యాసంస్థలు ఏర్పాటు మరో ముఖ్యహామీ. విభజన హామీల అమలుకు తాము కేంద్ర పైన ఒత్తిడి తెస్తామని హామీ ఇచ్చారు. అదే కాకుండా లోకాయుక్త పరిధిలోకి ప్రజా ప్రతినిధులు తీసుకొని వస్తానని ఇందులో పేర్కొన్నారు. ఇలా కేవలం 13 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ తెలంగాణ టిడిపి ఫుల్ జోష్ తో దూసుకుపోతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను మార్చే ప్రయత్నం చేస్తున్నారు.Top