జగన్ ఆంధ్రా సీఎం? తేల్చి చెప్పిన లగడపాటి?

జగన్ ఆంధ్రా సీఎం? తేల్చి చెప్పిన లగడపాటి?

ఎన్నికలు ఎప్పుడు ఎక్కడ జరిగిన లగడపాటి రాజగోపాల్ సర్వేకు ఉండే ప్రాముఖ్యతే వేరు. ఆయన సర్వేల వెల్లడించిన ఫలితాలన్నీ వచ్చే ఫలితాలకు చాలా దగ్గరగా ఉంటాయి. దాదాపు ప్రజల నాడికి దగ్గరగానే ఈయన చెప్పే విషయాలన్నీ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి డిసెంబర్ 7వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తోందో… ఏ అభ్యర్థి విజయం సాధిస్తారో అనే విషయమై లగడపాటి సర్వే పేరుతో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగింది.
 
ఈయన సర్వే కున్న ప్రజాదరణను దృష్టిలో పెట్టుకొని పలువురు ఇదే లగడపాటి సర్వే అంటూ సోషల్ మీడియాలో తెగ ఊదరగొట్టే స్తున్నారు. అది ఎంత వరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతానికైతే ఒక సర్వే ఇదే లగడపాటి చెప్పింది అని బయటకు వచ్చింది. ఈ సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు కాబోయే సీఎం జగన్మోహన్ రెడ్డి అంట. జగన్ మొదలుపెట్టిన ప్రజాసంకల్ప యాత్రకు,ఆయన ప్రకటించిన నవరత్నాలకు ప్రజల నుండి మంచి స్పందన వచ్చిందట. మ‌రో వైపు ప‌వ‌న్ ఎఫెక్ట్‌కూడా టీడీపీకీ ఉంటుంద‌ని తెలిసింది. ఉభయ గోదావరి జిల్లాలలో జనసేనకు భారీ మద్దతు ఉన్నందున అక్కడ టీడీపీకి రావాల్సిన ఓట్లు చీలి అది జగన్ కు లభిస్తుందని ఇందులో సారాంశం. అలాగే తెలంగాణలో కూడా ఏ పార్టీ విజయం సాధిస్తుంది, మరీ ప్రత్యేకంగా ఏ అభ్యర్థి విజయం సాధిస్తాడో ఈ సర్వే తేల్చి చెప్పేస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఈ సర్వే మాత్రం సోషల్ మీడియా అంతా భారీ స్థాయిలో చక్కర్లు కొడుతోంది.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top