కాంగ్రెస్ గెలిస్తే మహిళా ముఖ్యమంత్రి ?

By Xappie Desk, November 23, 2018 10:50 IST

కాంగ్రెస్ గెలిస్తే మహిళా ముఖ్యమంత్రి ?

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే మహా కూటమి మరియు టిఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం..ప్రచార పర్వం నువ్వా నేనా అన్నట్టుగా ఉంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రజలను ఆకర్షించడానికి ఆయా రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలో అనేక హామీలు ఇస్తున్నారు. గతంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే దళితుడు తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి అవుతారని కేసీఆర్ హామీ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ విధంగానే ఓ హామీ ప్రకటించడంతో తెలంగాణ రాజకీయాల్లో ఆ హామీ ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయింది. తెలంగాణలో మహాకూటమిని కనుక గెలిపిస్తే ఒక మహిళను ముఖ్యమంత్రిగా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
 
ఈ ప్రకటనతో తెలంగాణలోని మహిళ ఓట్లను కొల్లగొట్టడానికి దీన్నో బ్రహ్మాస్త్రంగా ఆ పార్టీ భావిస్తోంది. అఖిల భారత కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సుస్మితా దేవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమితి గత నాలుగేళ్లుగా మహిళల పురోగతికి చేసింది ఏమి లేదని - కల్వకుంట్ల వారి పాలనతో మహిళలు చాల అన్యాయానికి గురైయ్యారని అన్నారు. రాబోయే ఎన్నికలలో మహాకూటమి అధికారంలోకి వస్తుందని ఆ తర్వాత తెలంగాణకు మొదట ఒక మహిళా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి చరిత్ర తిరగరాస్తుందని ఆవిడ అన్నారు. ఇదే విషయం గురించి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తో త్వరలోనే మాట్లాడతామని ఆమె హామీ ఇచ్చింది. దేశంలో మొదటి నుండి మహిళలకు ప్రాధాన్యత నిచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని..ఈ నేపధ్యంలో తెలంగాణ రాష్ట్రంలో వస్తున్న రెండో అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి అధికారంలోకి వస్తే కచ్చితంగా ఓ మహిళ తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని ఆమె తెలిపింది.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top