నోటా కి ఓటు వెయ్యమంటున్న కేటీఆర్ !

నోటా కి ఓటు వెయ్యమంటున్న కేటీఆర్ !

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఓ కళాశాలలో విద్యార్థులతో భేటీ అయ్యారు ఈ సందర్భంగా రానున్న ఎన్నికలలో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని సమాజంలో రాజకీయాలలో యువత ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతే కచ్చితంగా మంచి రాజకీయ నేతలు వస్తారని కేటీఆర్ మాట్లాడారు. అంతేకాకుండా రానున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే బంగారు తెలంగాణ గా మారాలంటే..యువత ఓట్లే కీలకమని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ''మీ ఓట్లు ఎలాగూ టీఆర్ ఎస్ కే వేస్తారు.
 
ఒకవేళ అలా కాకుండా.. మీకు ఇంకో ఆలోచన ఉంటే దాన్ని నేను తప్పుపట్టను. మీకు నచ్చినవారికి ఓటు వెయ్యండి. ఎవరికీ ఓటు వెయ్యడం ఇష్టం లేకపోతే 'నోటా'కి ఓటు వెయ్యండి. అంతేగానీ - ఓటు వెయ్యడం మాత్రం మానెయ్యొద్దు'' అని కేటీఆర్ అన్నాడు. ఇదే క్రమంలో విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు కూడా ఇచ్చారు కేటీఆర్.
 
ముఖ్యంగా ఎవరికి ఓటు వేయకపోతే నోటుకు ఓటు వేయమని మంత్రి కేటీఆర్ విద్యార్థుల మధ్య అనటంతో చాలామంది ఆశ్చర్యపోయారు.ప్రస్తుతం కేటీఆర్ టిఆర్ఎస్ పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలతో కలుస్తూ బహిరంగ సభలలో పాల్గొంటూ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు ఏంచేసిందో ప్రజలకు స్పష్టత ఇస్తూ రానున్న రోజుల్లో ఏ విధంగా టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ముందుకు వెళ్తుందో అర్థమయ్యేరీతిలో ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నారు కేటీఆర్.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top