ఒక్క దెబ్బకి జగన్ రెండు పిట్టలు - అద్దిరిపోయే స్ట్రాటజీ !

ఒక్క దెబ్బకి జగన్ రెండు పిట్టలు - అద్దిరిపోయే స్ట్రాటజీ !

ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రస్తుతం విజయనగరం జిల్లాలో కొనసాగుతోంది. జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసింది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే అనేక జిల్లాలలో పాదయాత్ర చేసిన జగన్ కి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. జగన్ అడుగు పెట్టిన ప్రతి చోట ప్రజల సమస్యలు తెలుపుకుంటూ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం తమని ఏవిధంగా బాధపెట్టింధో ముఖ్యంగా గత ఎన్నికలలో అధికారం కోసం చంద్రబాబు ఏ విధంగా అబద్ధపు హామీలు ఇచ్చి తమను మోసం చేశారో అన్న విషయాలను జగన్ దృష్టికి తీసుకు వస్తూ స్థానికంగా తమకున్న సమస్యలు జగన్ కి తెలియజేస్తూ తమ బాధను చెప్పుకుంటున్నారు..ఇదే క్రమంలో జగన్ కూడా తన దగ్గరికి వస్తున్న ప్రతి ఒకరి బాధ వింటూ అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నారు.
 
ముఖ్యంగా జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర మూడు వేల కిలోమీటర్లు దాటి ప్రస్తుతం ఉత్తరాంధ్ర ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్న జగన్ త్వరలో తన పాదయాత్ర ముగించబోతున్నారు. తనపై హత్యాయత్నం జరిగిన ఎక్కడ కూడా బెదరకుండా జగన్ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ప్రజలు కూడా జగన్ ధైర్యాన్ని చూసి అతడు ప్రజల కోసం పడుతున్న కష్టాన్ని చూసి చాలామంది పాదయాత్రలో నువ్వు నీ కుటుంబం జాగ్రత్త బాబు మా కోసం ఇంతగా కష్టపడుతున్న నిన్ను చూస్తుంటే..మీ నాన్న గుర్తు వస్తున్నారు..నాన్న కి తగ్గ కొడుకువి నువ్వు ఆరోగ్యం జాగ్రత్త అంటూ చాలామంది వృద్ధులు జగన్ కి సూచనలు ఇస్తూ తమ ప్రేమను వెల్ల పరుస్తున్నారు.
 
అంతేకాకుండా రానున్న రోజుల్లో ఈ సారి నిన్ను వదులుకో మంటూ...మరొకసారి అబద్ధాలు చెప్పే నాయకులను దరిదాపులో లేకుండా...ఎన్నికల ముందు వచ్చి హడావిడి చేసి అరుపులు కేకలు వేసే నాయకులు కూడా రాజకీయాలలో లేకుండా సరైన బుద్ధి చెబుతామని నిన్ను గెలిపించుకుంటామని..మా బ్రతుకులు మార్చుకుంటామని చాలామంది ఆవేదనతో జగన్ కి తెలియజేస్తున్నారు..ఇదే క్రమంలో జగన్ కూడా రానున్న ఎన్నికల్లో మీ మనసాక్షి తగ్గట్టు ఓటు వేయండి అంటూ మాట్లాడటం విశేషం. మరియు అదే విధంగా జ‌గ‌న్ పాద‌యాత్ర జ‌న‌వ‌రి చివ‌రివారంలో ముగిసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. అదే సమయంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని వైసీపీ అంచనా వేస్తోంది.ఫిబ్ర‌వ‌రిలో ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ ఉటుంద‌ని ఈసీ తెలిపిన సంగ‌తి తెలిసిందే. బ‌స్సు యాత్ర చేస్తూనే అభ్య‌ర్తుల‌ను జ‌గ‌న్ ప్ర‌క‌టిస్తార‌ని పార్టీ వ‌ర్గాలు భావిస్తున్నాయి. పాద‌యాత్ర పూర్త‌య్యే స‌మ‌యానికి ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ కూడా వ‌స్తుంది కాబ‌ట్టి ఒకే దెబ్బ‌కు రెండు పిట్ట‌లన్న‌మాట‌...అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top