వారాల జల్లులతో ముంచేస్తోన్న కెసిఆర్ !

By Xappie Desk, November 23, 2018 12:19 IST

వారాల జల్లులతో ముంచేస్తోన్న కెసిఆర్ !

ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కేసీఆర్ నిజామాబాద్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో వరాల జల్లులు కురిపించారు. రానున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే కచ్చితంగా ఉద్యోగులకు ఫిట్మెంట్ ఇవ్వడంతోపాటు పదవీ విరమణ వయసు విషయమై మంచి నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. బంగారు తెలంగాణ కోసం టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న కృషికి ఉద్యోగులు సహకరించాలని పిలుపునిచ్చారు కేసీఆర్.
 
ఇచ్చిన హామీలు మొత్తం నెరవేరాలంటే రానున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి ని గెలిపించి తెలంగాణ అభివృద్ధికి బంగారు తెలంగాణ కి నిజామాబాద్ జిల్లా ప్రజలు సహకరించాలని కేసీఆర్ కోరారు. అంతేకాకుండా ఇకపై శ్రీరాంసాగర్‌ ఎండిపోదని, కాళేశ్వరం నీళ్లతో శ్రీరాంసాగర్‌ నింపుతామని కేసీఆర్ హామీ ఇచ్చారు.
 
రైతు రుణమాఫీ చేస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. ధనిక రైతులకే రూ.2 లక్షల రుణాలు ఉంటాయని, మళ్లీ అధికారంలోకి వచ్చాక రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. ఇలా కేసిఆర్ నిజామాబాద్ మరియు ఆదిలాబాద్ జిల్లాలలో పర్యటిస్తూ టిఆర్ఎస్ పార్టీ తరఫున నిర్వహిస్తున్న ఆశీర్వాద బహిరంగ సభలలో పాల్గొంటూ ప్రజలకు హామీ ఇస్తూ రానున్న రోజుల్లో టిఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావాలని పిలుపునిస్తున్నారు కేసీఆర్.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top