టిడిపి రెండో వికెట్ పడింది - రసవత్తరంగా తెలంగాణ రాజకీయం!

By Xappie Desk, November 23, 2018 15:14 IST

టిడిపి రెండో వికెట్ పడింది - రసవత్తరంగా తెలంగాణ రాజకీయం!

తెలంగాణలోని టిడిపి నేతలను ఒక్కొక్కరుగా ఆ పార్టీ కోల్పోతుంది. అసలు టికెట్ ఇవ్వలేదని కొంత మంది పార్టీని వీడిపోగా, అడిగిన చోట స్థానం ఇవ్వలేదని మరికొంతమంది అస్త్ర సన్యాసం పుచ్చుకుంటున్నారు. ఈ తతంగమంతా చూడలేక కాంగ్రెస్ నేతలు తలపట్టుకున్నారు. మహాకూటమి ఏర్పాటు అయిన తర్వాత కేవలం గెలిచే స్థానాల్లోనే పోటీ చేస్తామని ఫిక్స్ అయిన టిడిపికి ఇప్పుడు ఇటువంటి ఉపసంహరణ చర్యలు మింగుడుపడడం లేదు.
 
తాజాగా సామా రంగారెడ్డి తాను పోటీ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆయనకు ఇబ్రహీంపట్నం నుంచి టిడిపి సీటు కేటాయించింది. అయితే అతని మాత్రం ఎల్బీనగర్ నుండి పోటీ చేయాలని ఆశాభావం వ్యక్తం చేశాడు. మహా కూటమిలో ఎంతో తర్జన భర్జన అనంతరం సీట్లు సర్దుబాబు వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. ఓ 14 సీట్లను టీడీపీ కేటాయిస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. మొదట్లోనే ఓ స్తానం వదిలేయగా - 13 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇలాంటి సమయంలో ఇటువంటి నిర్ణయం టిడిపికి పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి.
 
ఇలా పార్టీని వీడిన వారిలో రంగారెడ్డి రెండవ వాడు. అసలుకి ముందు నుండే ఇబ్రహీంపట్నం స్థానం పైన కాంగ్రెస్ నేతలకు ఒక ముగ్గురికి కన్ను ఉంది. ఈ సీటుపై మల్ రెడ్డి రంగారెడ్డి చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆయనకు బదులుగా టీడీపీకి సీటు కేటాయించారు. ఇప్పుడు రంగారావు నై అనడంతో - కాంగ్రెస్ పార్టీ తల పట్టుకుని కూర్చొంది. చేసేది లేక - బీఎస్పీ తరుపున బరిలో దిగిన మల్ రెడ్డి రంగారెడ్డికే కాంగ్రెస్ మద్దతు ఇవ్వనుంది. కేవలం గెలుస్తాము అని ధీమాగా ఉన్న స్థానాల నుండి పోటీ చేస్తామని టీడీపీ కి ఇలా నేతలు చేతులెత్తేయడం, ఒక్కొక్కరిగా వెనుదిరగడం చూస్తుంటే వారిలో ఏ ఒక్కరు నోరు మెదలట్లేదు.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.comTop