ఉత్తమ్ - రేవంత్ - హరీష్ రావు - ముగ్గురూ అడ్డంగా దొరికారు !

ఉత్తమ్ - రేవంత్ - హరీష్ రావు - ముగ్గురూ అడ్డంగా దొరికారు  !

తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. ఏ పార్టీకి సంబంధించిన ఆయా నేతలు తీవ్రస్థాయిలో తన ప్రచార కార్యక్రమాల్లో మునిగిపోయి ఉన్నారు. అయితే ఈ ఊపులో జరుగుతున్న పొరపాట్లను తప్పులను ఎన్నికల కమిషన్ ఏ మాత్రం తేలికగా పరిగణించట్లేదు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని వచ్చిన ఫిర్యాదుల మేరకు తెలంగాణలోని ఐదుగురు ప్రముఖ రాజకీయ నాయకులకు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. వీరు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ)ని అతిక్రమించడంతో ఈసీ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.
 
తెలంగాణ చీఫ్ ఎన్నికల కమిషనర్ ప్రాజెక్ట్ కుమార్ పలువురు నేతలకు నోటీసులు పంపించారు. వారిలో తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి హరీష్ రావు - కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి - వంటేరు ప్రతాప్ రెడ్డి తోపాటు టీడీపీ నేతల రేవూరి ప్రకాష్ రెడ్డిలు ఉన్నారు. అలాగే తెలంగాణ స్టేట్ పీసీసీ చీఫ్ ఉత్తంకుమార్ కూడా ఒక మతపరమైన మీటింగ్లో అనుచిత వ్యాఖ్యలు చేసి అడ్డంగా దొరికిపోయాడు అని,దానికి సంబంధించిన నోటీసులు తాము ఇప్పటికే పంపించామని ఉత్తమ కుమార్ చెప్పారు. ఇంకా తాము అతని నుండి వివరణ కోసం ఎదురుచూస్తున్నట్లు ఆయన అన్నారు.
 
టీఆర్ ఎస్ అభ్యర్థి - కరీంనగర్ తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తనపై పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థిని బెదిరించారని.. దానిపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నామని.. తగిన చర్యలు తీసుకుంటామని రజత్ తెలిపారు. అలాగే డిసెంబరు 7న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం తాము ఏకంగా తెలంగాణ రాష్ట్రం అంతా 32796 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని చెప్పారు. వీటి కోసం దాదాపు 48 వేల మంది పోలీసులను భద్రతా దళాలు గా నియమించినట్లు తెలిపారు. వీరితోపాటు 279 కంపెనీల కేంద్ర పారామిలిటరీ ఫోర్సెస్ (సీపీఎంఎఫ్) కూడా ఎన్నికల కోసం వినియోగిస్తున్నామని రజత్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం తిరస్కరణల తర్వాత తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 3583 నామినేషన్లు వచ్చాయని తెలిపారు.



Top