అన్నా! కూకట్‌పల్లిలో ప్రచారం చేయొద్దు ఎన్టీఆర్ ను బ్రతిమిలాడుతున్న ఫ్యాన్స్!

అన్నా! కూకట్‌పల్లిలో ప్రచారం చేయొద్దు  ఎన్టీఆర్ ను బ్రతిమిలాడుతున్న ఫ్యాన్స్!

కూకట్ పల్లి నియోజకవర్గంలో నందమూరి సుహాసిని నామినేషన్ వేసినప్పటి నుండి సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో ఒకటే చర్చ. తెలంగాణలో ముందస్తు ఎన్నికల ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్ బరిలోకి దిగుతాడా? లేదా? వస్తారని కొందరు ప్రచారం చేస్తుండగా ఆయన రారని మరికొందరు విశ్లేషిస్తున్నారు. తాజాగా ఈ విషయంపై క్లారిటీ వచ్చేసినట్లే కనిపిస్తోంది.
 
అసలు తన సోదరులైన కళ్యాణ్ రామ్ మరియు ఎన్టీఆర్ కు చెప్పకుండానే సుహాసిని ఎన్నికల బరిలోకి దిగింది అని ముందు చాలామంది అన్నారు. ఆమె రాజకీయ ప్రవేశంపై వీళ్ళిద్దరూ ముఖ భావంతో ఉన్నారని వార్తలు కూడా వచ్చాయి. అయితే అటువంటిదేమీ లేదని పాక్షికంగా మద్దతు ప్రకటిస్తున్నట్లు ఇప్పటికే వారిద్దరూ తమ ట్వీట్లతో తెలియజెప్పారు. అయితే కేవలం మద్దతు మాత్రమే ప్రకటించిన ఎన్టీఆర్ ప్రచారం విషయంలో మాత్రం అందులో ఏమాత్రం స్పష్టత ఇవ్వలేదు.
 
అయితే ఇటీవల తెలిసిన విషయం ఏమిటంటే ప్రచారం చేయాలా వద్దా అన్న విషయానికి సంబంధించి ఎన్టీఆర్ తన సన్నిహితులు-అభిమానులను సలహా కోరాడట. అయితే వారు దానికి ఇచ్చిన సమాధానం చూసి విస్తుపోయాడు. ప్రచారానికి వెళ్లకపోవడమే మంచిదని వారంతా భావించారట. ఇందుకు రెండు కారణాలు ఉన్నాయి. సుహాసిని నందమూరి వారసురాలు. అలాగే కూకట్ పల్లి కూడా టిడిపికి కంచుకోట. అక్కడ ఎన్టీఆర్ ప్రచారం చేసినా చేయకపోయినా అది ఫలితం మీద పెద్దగా తేడా చూపించకపోవచ్చు.
 
ఇంక రెండో విషయం ఏమిటంటే అవసరం కోసం నందమూరి వంశస్తులను నారా వారు వాడుకుంటారని ఎప్పటి నుండో ప్రాచుర్యంలో ఉన్న విషయం. అంతకు ముందు కూడా టీడీపీ తరఫున ఎన్టీఆర్ ప్రచారం చేస్తే ఎన్నికల్లో ఓటమికి మొత్తం నింద తీసుకువచ్చి అతని మీద వేసారు. అది కాకుండా తన అక్క తరఫున పోటీచేసి హరికృష్ణ మరణానంతరం తన కుటుంబానికి ఎంతో అండగా నిలబడ్డ కేసిఆర్ కుటుంబం తో వైరం పెంచుకోవడం కూడా భావ్యం కాదు అనిపించినట్లుంది. దీంతో వీరందరి అభిప్రాయాలను గౌరవిస్తూ ఎన్టీఆర్ ప్రచారానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.comTop