బ్రేకింగ్: ఆంధ్రాలో కొత్త పార్టీ..?

By Xappie Desk, November 24, 2018 11:29 IST

బ్రేకింగ్: ఆంధ్రాలో కొత్త పార్టీ..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రం రోజుకో విధంగా మారిపోతుంది. ఎన్నికలు దగ్గరకొస్తున్న కొలది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త కొత్త రాజకీయ సమీకరణాల జరుగుతున్నాయి. ఇప్పటికే ఆంధ్రాలో ప్రముఖ పార్టీలు అయిన టీడీపీ వైసీపీ జనసేన పార్టీలు ప్రజల మధ్య అంటూ ప్రచారం చేసుకుంటూ ముందుకెళ్తున్న క్రమంలో రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ వస్తున్నట్లు ఏపీ రాజకీయాలలో వార్తలు వినబడుతున్నాయి. సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ త్వరలో ఒక కొత్త పార్టీ పెట్టి రాజకీయ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిబిఐ జాయింట్ డైరెక్టర్ గా వ్యవహరించిన జేడీ లక్ష్మీనారాయణ మహారాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ అవ్వడం జరిగింది.. అయితే సమాజంపై ప్రేమతో రాజకీయాల్లో మార్పు కోసం ఇటీవల ఆయన చేస్తున్న పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రావడం జరిగింది.
 
ఈ క్రమంలో లక్ష్మీనారాయణ తన పార్టీ పేరును ''జనధ్వని''గా రిజిస్టర్ చేయించారని వార్తలు వస్తున్నాయి. సీబీఐ జేడీగా జనం నోళ్లలో నానిన ''జేడీ'' అన్న పదం కలిసొచ్చేలా.. జనధ్వని ''జేడీ'' ని పెట్టారని తెలుస్తోంది..దానితో పాటు వందేమాతరం అనే పేరు కూడా పరిశీలనలో ఉందని లక్ష్మీనారాయణ సన్నిహితులు చెబుతున్నారు. చాలా వరకు ''జేడీ'' అన్న పేరుపైనే లక్ష్మీనారాయణ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నెల 26న హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో కొత్త పార్టీని ప్రకటిస్తారని.. ఈ కార్యక్రమానికి కొంతమందికి ఆహ్వానాలు కూడా వెళ్లాయని తెలుస్తోంది. దీంతో ఈ వార్త బయటకి రావడంతో సోషల్ మీడియా లో ఇది పెద్ద హాట్ టాపిక్ అయింది.Top