అధినేతల రాకతో జోష్ లో ఉన్న టీ కాంగ్రెస్ నేతలు..!

By Xappie Desk, November 24, 2018 11:32 IST

అధినేతల రాకతో జోష్ లో ఉన్న టీ కాంగ్రెస్ నేతలు..!

తెలంగాణ రాష్ట్రంలో అతి త్వరలో జరగబోతున్న రెండో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీ కాంగ్రెస్ మేడ్చల్ ప్రాంతంలో నిర్వహించిన భారీ బహిరంగ సభ సక్సెస్ అవడంతో టీ కాంగ్రెస్ నేతల్లో జోష్ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ పెద్దలు అయినా రాహుల్ మరియు సోనియా గాంధీ సమక్షంలో జరిగిన ఈ మహాసభ ప్రస్తుతం తెలంగాణ ప్రాంత రాజకీయాలలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మాట్లాడుతూ 2014 ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమని..అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చూస్తే అటకెక్కిందని..ఎక్కడా కూడా అభివృద్ధి జరగలేదని..తెలంగాణ ప్రాంతంలో మహిళలు కూడా ఏ రంగంలో రాణించలేకపోతున్నారు ని అనేక షాకింగ్ కామెంట్ చేశారు సోనియాగాంధీ.
 
మేడ్చల్ లో జరిగిన ఈ మహాసభకు మహా కూటమికి చెందిన మొత్తం రాజకీయ నేతలు అంతా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం లో అడుగుపెట్టిన సోనియాగాంధీకి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నేత కృతజ్ఞతలు తెలిపారు..ముఖ్యంగా సభకు ప్రజలు తండోపతండాలుగా భారీగా హాజరవడంతో సభా ప్రాంగణం మొత్తం అంతా కిక్కిరిసిపోయింది. ఇదే క్రమంలో జరిగిన మహాసభలో చాలామంది తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నాయకులు అధికార పార్టీ టీఆర్ఎస్ పై మరియు కెసిఆర్ పై నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది 'మహాకూటమి' అని ధీమా వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో భారీ బహిరంగ సభకు చాలామంది కాంగ్రెస్ పెద్దలు హాజరవడంతో మంచి జోష్ లో ఉన్నారు తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలు..కచ్చితంగా ఎన్నికల్లో విజయం సాధిస్తామని అంటున్నారు.Top