తెలంగాణ ప్రజలే నాకు అధిష్టానం అంటున్న కేసీఆర్..!

By Xappie Desk, November 24, 2018 11:34 IST

తెలంగాణ ప్రజలే నాకు అధిష్టానం అంటున్న కేసీఆర్..!

ఎన్నికలు దగ్గర పడే కొలది తెలంగాణ రాష్ట్రంలో మహా కూటమి మరియు టిఆర్ఎస్ పార్టీ ల మధ్య మాటల తూటాలు మరింత తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పాల్గొన్న ప్రజా ఆశీర్వాద సభలో మహా కూటమి పార్టీల పై ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీపై తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ నిప్పులు చెరిగారు కేసీఆర్. మరియు అదే విధంగా టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పై కూడా విమర్శల వర్షం కురిపించారు కేసిఆర్.
 
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే చీకటి రాష్ట్రం వస్తుందని అప్పటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కామెంట్ చేశారు.. అదేవిధంగా చంద్రబాబు కూడా అనేక కుయుక్తులు పన్ని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రతిసారి అడ్డుపడ్డారని... అయితే ఎన్నికలు వస్తున్న తరుణంలో జరుగుతున్న అభివృద్ధికి అడ్డుకట్ట వేయడానికి వీలు అందరు కలిసి ఏకమవుతున్నారు అంటూ విమర్శల వర్షం కురిపించారు కేసీఆర్.
 
అంతేకాకుండా కాంగ్రెస్ నేతలు ఏ నిర్ణయం తీసుకోవాలన్న ఢిల్లీకే వెళ్లాలని ఎద్దేవా చేశారు. తెలంగాణ మీద చంద్రబాబు పెత్తనం అవస రమా? కత్తి ఆంధ్రో డిదే.. పొడిచేది తెలంగాణోడు. ప్రాజెక్టులు ఆపాలని చంద్రబాబు 35 ఉత్తరా లు రాశారు. మన గొంతు కోసే చంద్రబాబును గెలిపిద్దామా? చంద్రబాబు మీ ఇంటికే వచ్చి కొట్టిపోతా అంటున్నాడు. మనం అంత పౌరుషం లేకుండా ఉన్నామా?. 17 మంది ఎంపీలను గెలిపించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఢిల్లీ మెడలు వంచి ముస్లిం, ఎస్టీ రిజర్వేషన్లు సాధిస్తామని స్పష్టం చేశారు. ప్రజల చేతిలో పెత్తనం పెట్టి వాళ్లకే అధికారం ఇస్తా మని కేసీఆర్ స్పష్టం చేశా రు.
 
ప్రతి చోట జరుగుతున్న సభకు వస్తున్న స్పందన చూస్తుంటే కచ్చితంగా రానున్న రోజుల్లో బంగారు తెలంగాణ అభివృద్ధి సాధ్యమని స్పష్టంగా కళ్ళముందు కనబడుతుందని కచ్చితంగా రెండోసారి టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి తెలంగాణ ప్రతి పౌరుడి కల నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు కేసీఆర్. ఎందుకింత ధీమాగా చెబుతున్నానంటే తెలంగాణ ప్రజలే మాకు అధిష్టానం అని కాబట్టి వారి నిర్ణయాల మేరకే రానున్న రోజుల్లో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కేసిఆర్.
 
Note : - Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.comTop