నువ్వు తప్పుకో నేను వస్తా జగన్ కి స్ట్రైట్ గా కౌంటర్ ఇచ్చిన పవన్..!

By Xappie Desk, November 24, 2018 11:40 IST

నువ్వు తప్పుకో  నేను వస్తా జగన్ కి స్ట్రైట్ గా కౌంటర్ ఇచ్చిన పవన్..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్ పై సంచలన కరమైన కామెంట్లు చేశారు. ఎన్నికలలో రాష్ట్ర ప్రజలు ప్రతిపక్ష నేతగా తమ సమస్యల కోసం పోరాడాలని జగన్ కి మంచి స్థానం ఇస్తే తన ఎమ్మెల్యేలను అధికార పార్టీ కొనేసింది అని రోడ్డుపై ముసలి కన్నీరు కారుస్తూ వ్యవహరించడం దారుణం అని నిప్పులు చెరిగారు పవన్ కళ్యాణ్. సొంత పార్టీ ఎమ్మెల్యేలను ఆపుకోలేని వ్యక్తి రాష్ట్రాన్ని ఎలా నియంత్రిస్తాడు అని మండపేటలో ఇటీవల జరిగిన మహాసభలో పవన్ కళ్యాణ్ నిలదీశారు. నీకు చేతకాకపోతే తప్పుకో జగన్ నేను వచ్చి రాజకీయాలు చూసుకుంటానని జగన్ కి స్ట్రైట్ గా సవాల్ విసిరారు.
 
జగన్ స్థానంలో తాను ఉంటే భయపడి రోడ్లపై వెళ్లేవాడిని కాదని ఎమ్మెల్యేలు అంతా అమ్ముడుపోయినా తాను వెనకడుగు వెయ్యనని ఒక్కడినే అయినా అసెంబ్లీకి వెళ్తానన్నారు. అంతేకానీ జగన్ లా భయపడి రోడ్డున పడనన్నారు. ఒక రాజకీయ పార్టీగా ఉన్న జనసేన కు ఒక ఎమ్మెల్యే ఎంపీ లేడు ఇప్పటికే అనేక ప్రజా సమస్యలపై పోరాడి కొన్ని వాటికి పరిష్కారం కూడా చూపి మేమే ఇంత చేస్తుంటే నీ దగ్గర అంత మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు కదా మరి మీరు ఎంత చేయాలి వైసిపి పార్టీని ప్రశ్నించారు. నాకు గుండె నిండా దైర్యం ఉంది ఎవరైనా ప్రశ్నించగా దమ్ము ఉంది ప్రజల కోసం పోరాటం చేయగలను అని పేర్కొన్నారు పవన్.
 
ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కామెంట్ విన్న కొంతమంది వైసిపి నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రానికి ప్రధాన విభజన హామీ అయిన్న ప్రత్యేక హోదా విషయం నుండి ఇప్పటి వరకు రాష్ట్ర అధికార పార్టీ చేస్తున్న ప్రతి అవినీతి కార్యక్రమం పై పోరాడిన ఏకైక వ్యక్తి ఇంకా పోరాడుతున్న నాయకుడు జగన్ అని కౌంటర్ వేశారు.. ఎన్నికలకు సంవత్సరం ముందు తెలుగుదేశం పార్టీ నుండి బయటకు వచ్చి నేను అధికారం లోకి వస్తాను అసెంబ్లీ లో ఉంటాను ముఖ్యమంత్రి అవుతాను జగన్ చేతకానివాడు నాకు దమ్ము ఉంది అంటూ కామెంట్లు చేస్తున్న పవన్ కళ్యాణ్..ప్రజలకి ప్రతిదీ తెలుసు ఎవరికి దమ్ముందో..ఎవరు ముందు నుండి వారి కోసం పోరాడుతున్నారో అంటూ వైసీపీ నేతలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి కౌంటర్ లు వేస్తున్నారు.Top