'నాది ఒకే ఒక్క కోరిక,' సభలో ఎలుగెత్తి చాటిన సోనియా!

By Xappie Desk, November 24, 2018 11:40 IST

'నాది ఒకే ఒక్క కోరిక,' సభలో ఎలుగెత్తి చాటిన సోనియా!

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా అక్కడ అడుగు పెట్టిన సోనియా ఎన్నికల ప్రచారంలో భాగంగా తన తొలి సభ లోనే పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. మొదటి దెబ్బ లోనే తన అనుభవంతో పాటు సెంటిమెంట్ ను కూడా రంగరించింది. తెలంగాణలో ఉన్న ప్రజలందరినీ చూస్తుంటే చాలా రోజుల తర్వాత కన్నబిడ్డల్ని చూసిన తల్లి లాగా తన ఉద్వేగానికి లోనవుతున్నట్లు ఆమె చెప్పారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో ఎన్ని కష్టాలు ఎదురయ్యాయో మీకు తెలియంది కాదు. రాష్ట్ర విభజన అంత సులభం కాదనిపించింది. తెలంగాణ ఉద్యమ పోరాటాన్ని ఆకాంక్షను గౌరవించి మన్మోహన్ - రాహుల్ విభజన నిర్ణయం తీసుకున్నారని వివరించారు.
 
అలాగే ఏపీ ప్రజలకు కూడా ఎటువంటి నష్టం వాటిల్లకుండా తాము అప్పుడు ప్రత్యేక హోదా హామీ ఇచ్చామని ఆమె చెప్పుకొచ్చారు. ఇప్పటికీ కాంగ్రెస్ దానికి కట్టుబడి ఉందన్నారు. ఈ ప్రసంగంలో భాగంగా ఆమె తనది ఒకే ఒక్క కోరిక అని, తెలంగాణలో మళ్లీ పూర్వ వైభవాన్ని చూడాలని...తాను ఎక్కడికి వెళ్ళినా ఇతర రాష్ట్రాల్లో తెలంగాణ అభివృద్ధిని ఉదాహరణగా చూపించేదాన్ని అని...కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక తనకి ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదని విమర్శించారు.
 
నీళ్లు - నిధులు - నియామకాలు అనే నినాదాలతో రాష్ట్రం తెచ్చుకుంటే అందులో ఒక్కటైనా టీఆర్ ఎస్ సర్కారు సఫలీకృత చేయలేదని విమర్శించారు. అందుకే రాష్ట్రం ఇచ్చిన తమను ఆశీర్వదిస్తే తెలంగాణ ప్రజలు కోరుకున్న అభివృద్ధి చేసి చూపిస్తామని... కేసీఆర్ కు తగిన గుణపాఠం చెప్పాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఇప్పుడున్న టిఆర్ఎస్ ప్రభుత్వం తాము పెట్టిన భూసేకరణ చట్టాన్ని తుంగలో తొక్కి రైతులను, రైతు కూలీలను రోడ్డుమీద పడేశారని ఆమె విమర్శించారు. ఈనెల తెలంగాణ పాలనలో ఒక్క వారి కుటుంబీకులు మాత్రమే అభివృద్ధి చెందారని అన్నారు. ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా అంధకారంలోకి నెట్టేసింది. టిఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే అవకాశం వచ్చిందని ఆమె అన్నారు. "ఇది చరిత్రాత్మకమైన సందర్భం. ఇప్పటి మీ నిర్ణయంతోనే తెలంగాణ భవిష్యత్తు ముడిపడి ఉంటుంది. మాట మీద నిలబడని వాళ్లను ప్రజలు నమ్మవద్దు. అందుకే భవిష్యత్తు కోసం ఆలోచించి కాంగ్రెస్ కు ఓటేయండి``... అంటూ ముగించారు.
 
Note : - Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com


Top