ఓటు వేసి సెల్ఫీ దిగారో... అయిపోయారే !

By Xappie Desk, November 24, 2018 11:54 IST

ఓటు వేసి సెల్ఫీ దిగారో... అయిపోయారే !

ఇప్పుడొస్తున్న స్మార్ట్ఫోన్లలో మూన్ లైట్ సెల్ఫీ, డ్యూయల్ క్యామ్ సెల్ఫీ, ఆ సెల్ఫీ సెల్ఫీ అంటూ యువతను ఆకట్టుకుంటున్నారు. ఈ సెల్ఫీల మాయలో పడి ఇప్పుడున్న కుర్రకారంతా విందులు, వినోదాలు స్నేహితులు, విహారయాత్రలు అని తేడా లేకుండా ఎక్కడ పెడితే అక్కడ సెల్ఫీలు తీసుకుంటున్నారు. మీరు ఎక్కడికైనా వెళ్లి సెల్ఫీ తీసుకోండి కానీ పోలింగ్ కేంద్రాల్లో మాత్రం తీసుకుంటే తగిన చర్యలు తప్పవు అంటుంది ఎన్నికల సంఘం.
 
తాజాగా పోలింగ్ కేంద్రాల్లో సెల్ఫీ తీసుకోవడాన్ని ఎన్నికల సంఘం నిషేధించింది. ఒకవేళ ఇది అతిక్రమించి సెల్ఫీ తీసుకుంటే 49ఎం నియమం ఉల్లంఘించినందుకు ఓటరును బయటకు పంపించే అధికారం అధికారులకు ఉంటుంది. ఈ మేరకు కొత్తగా ఎన్నికల నియమావళిలో 17ఏను నమోదు చేశారు. దీని ప్రకారం ఓటు వేసిన తర్వాత సదరు ఓటరు, సెల్పీ తీసుకున్నట్లయితే అతని ఓటు, ఓట్ల లెక్కింపు సమయంలో పరిగణన లోనికి తీసుకోబడడు.
 
మొదటి సారి అంటూ ఓటు వేసిన ఉత్సాహంతో సెల్ఫీలు తీసుకునే యువత ఎంతో మంది ఉంటారు. వారికి ఈ కొత్త నిబంధనపై అవగాహన తక్కువ. వారంతా సెల్ఫీలు తీసుకునే అవకాశాలుంటాయి. ఇది సాధారణంగా జరిగే విషయం కావడం వల్ల, ఎన్నికల సంఘం యువతకు దీనిపై తగిన రీతిలో సరైన అవగాహన కల్పిస్తే మంచిది. లేదంటే వారు తమ ఓటును కోల్పోవడంతో పాటు చిక్కుల్లో కూడా పడాల్సి ఉంటుంది.
 
Note : - Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top