కాపు ఓట్ల చీల్చడానికి కోసమే జేడీ కొత్త పార్టీ...? బాబు మాస్టర్ ప్లాన్?

By Xappie Desk, November 24, 2018 20:16 IST

కాపు ఓట్ల చీల్చడానికి కోసమే జేడీ కొత్త పార్టీ...?  బాబు మాస్టర్ ప్లాన్?

ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు రోజుకో విధంగా మారుతున్నాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ భయంకరమైన ప్రజావ్యతిరేకత తో ప్రస్తుతం పాలన కొనసాగిస్తున్నారు. 2014 ఎన్నికలలో కాపులను బీసీల చేరుస్తానని చెప్పి అనేక అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అనతికాలంలోనే కాపులు తిరగబడటంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదే క్రమంలో గత నాలుగు సంవత్సరాలు చంద్రబాబుతోనే కలిసి ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనేకసార్లు కాపుల విషయంలో చంద్రబాబు నిర్ణయాలు సమర్ధించిన.. కాపులు ఏ మాత్రం పవన్ కళ్యాణ్ ని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. అయితే ఎన్నికలకు ఇంకో సంవత్సరం ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీని విడిచి ప్రత్యేకంగా జనసేన పార్టీ పోటీ చేస్తున్న నేపథ్యంలో.. కాపు ఓటు బ్యాంకు తన నుండి పోతుందేమోనని చంద్రబాబు సరికొత్త రాజకీయ ఎత్తుగడ వేశారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆయనతో కొత్త పార్టీ పెట్టి స్తున్నట్లు ఆంధ్రరాష్ట్రంలో తెగ వార్తలు వినపడుతున్నాయి. రానున్న ఎన్నికల్లో కాపు ఓట్లు తెలుగుదేశం పార్టీకి పడకపోయినా…. అవి తన పరిధిలో ఉండేటట్లు చంద్రబాబు తాజాగా ఈ మాస్టర్ ప్లాన్ వేసినట్లు రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.Top