బాబు తో రాబోతున్న పార్టీ లు ఇవే - జాతీయ స్థాయి లో సంచలనం !

బాబు తో రాబోతున్న పార్టీ లు ఇవే - జాతీయ స్థాయి లో సంచలనం !

స్తబ్దుగా ఉన్న జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం చంద్రబాబు. మోడీని ఎలా ఎదుర్కోవాలో తెలియక… దారీ తెన్ను కానరాక కాంగ్రెస్ సహా… తృణమూల్ కాంగ్రెస్, సమజ్వాదీ, బీఎస్పీ, లెఫ్ట్ పార్టీలు ఇలా అందరూ బెంబేలెత్తుతున్న తరుణంలో చంద్రబాబు రాకతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ మోడీ వ్యతిరేక పార్టీలన్నింటికి వేయి ఏనుగుల శక్తి వచ్చినట్లు అయ్యింది. అందుకే ఈ రోజు ఎక్కడకు వెళ్లిన చంద్రబాబు ఆత్మీయ ఆహ్వానం లభిస్తోంది. రాహుల్ ని చంద్రబాబు కలిసి నెల రోజులు కూడా గడవకుండానే వారి కూటమిలోకి పార్టీల వెల్లువ కొనసాగుతోంది. అన్ని కుదురుకొని జాతీయ స్థాయిలో మహాకూటమి ఆవిర్భావానికి రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే 18 పార్టీలు కూటమిలో చేరేందుకు సానుకూలంగా ఉన్నాయని విశ్వసనీయవర్గాల సమాచారం. డిసెంబరు 11న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే పార్లమెంట్‌ వేదికగా మహాకూటమి ఏర్పాటుకు నాంది పడనుంది.
 
మహాకూటమికి రోజురోజుకూ స్పందన పెరుగుతోందని, కూటమిలో చేరే పార్టీల సంఖ్య పెరుగుతోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఒకరు చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం అవుతున్నాయన్నారు. ఒడిసాలో బీజేడీ కూడా మహాకూటమిలో చేరేందుకు సిద్ధమవుతోందని, ఆ రాష్ట్ర సీఎం నవీన్‌ పట్నాయక్‌ ఇప్పటికే బాబుతో చర్చించినట్లు తెలుస్తోందన్నారు. జనవరిలో మమతా నిర్వహిస్తున్న ర్యాలీకి హాజరయ్యేందుకు బీజేడీ అంగీకరిం చిందన్నారు.కశ్మీరులో రాష్ట్రపతి పాలన విధించడంతో అక్కడి పీడీపీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ రెండూ కూటమిలో చేరేందుకు అవకాశం ఏర్పడిందని తెలిపారు. ఇక మోడీకి మద్దతుదారులుగా ఉన్న ప్రధాన పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక్క జేడీయూ మాత్రమే. ఇప్పుడు అది కూడా ఎన్డీయేకు గుడ్‌ బై చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహాకూటమిలో ప్రస్తుతం కాంగ్రెస్‌, తెలుగుదేశం,ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్‌ కాంగ్రెస్‌, డీఎంకే, జేడీఎస్‌, ఎన్సీపీ, ఆర్జేడీ, జేఎంఎం, జార్ఖండ్‌ వికాస్‌ పార్టీ, రాష్ట్రీయ లోక్‌ దళ్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీడీపీ, లోక్‌ తాంత్రిక్‌ జనతాదళ్‌, సీపీఐ, సీపీఎం, ఆప్‌ తదితర పార్టీలు ఉన్నాయి. “నిరాశగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీలో నూతన ఆశలు చిగురించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే కారణం. ఆయన తన ఒంటెత్తు పోకడలు, అహంభావ ప్రవర్తనతో తెలంగాణలో కేసీఆర్‌ తరహాలోనే రాజకీయ ప్రత్యర్థులను ఏకం చేస్తున్నారు.
 
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును దూరం చేసుకోవడం నరేంద్ర మోడీ చేసిన అతిపెద్ద పొరపాటు. జాతీయ రాజకీయాలలో చంద్రబాబుకు ఉన్న పరిచయాల గురించి తెలిసి కూడా మోడీ ఆయనను దూరం చేసుకున్నారు” అని ప్రముఖ మీడియా అధినేత ఆర్కే తన కొత్త పలుకు వ్యాసంలో కుండ బద్దలు కొట్టారు.మబ్బులను చూసి చెంబులో నీళ్లు ఒలకబోసుకున్నట్టుగా జగన్మోహన్‌రెడ్డిని చూసుకుని చంద్రబాబును వదులుకున్నారని ఆయన అందులో వ్యాఖ్యానించారు. “మోడీనే చంద్రబాబు కాంగ్రెస్‌కు దగ్గరయ్యే పరిస్థితి కల్పించారు. అంతేకాదు.. కాంగ్రెస్‌ తరఫున వకాల్తా పుచ్చుకుని మిగతా పార్టీలన్నింటినీ కాంగ్రెస్‌తో జట్టు కట్టేలా చంద్రబాబు తన పాత పరిచయాలను ఉపయోగించుకుని కృషి చేస్తున్నారు. చంద్రబాబు కృషి కారణంగా ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీకే కాకుండా, ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి కూడా విశ్వసనీయత పెరిగింది. అప్పటివరకు కాంగ్రెస్‌తో చేతులు కలపడానికి అంతగా సుముఖత చూపని కొన్ని ప్రాంతీయ పార్టీలు వచ్చే పార్లమెంట్‌ ఎన్నికలలో కలిసి పోటీ చేయడానికి అంగీకరించాయి” అని విశ్లేషించారు. “మహారాష్ట్రలో కాంగ్రెస్‌తో కలిసి లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయబోతున్నట్టు ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీతో కలిసి పోటీ చేయడానికి మాయావతి అంగీకరించారు. ఈ రెండు నిర్ణయాలు అమలు జరిగితే వచ్చే ఎన్నికల తరవాత నరేంద్ర మోడీ అధికారం నుంచి దిగిపోక తప్పని పరిస్థితి ఏర్పడవచ్చు” అని పేర్కొన్నారు.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.comTop