నందమూరి సుహాసిని కి ప్రచారం చేయ్యబోతోన్న కెసిఆర్ కూతురు - తెలంగాణా లో షాకింగ్ !

By Xappie Desk, November 25, 2018 20:39 IST

నందమూరి సుహాసిని కి ప్రచారం చేయ్యబోతోన్న కెసిఆర్ కూతురు - తెలంగాణా లో షాకింగ్ !

కేసీఆర్ సోదరుడి కూతురు రమ్యరావు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఎప్పటినుంచో గళమెత్తుతున్న సంగతి తెలిసిందే.. ఆమె కాంగ్రెస్ లో చేరి కేసీఆర్ వైఖరిపై తీవ్ర విమర్శలు చేస్తోంది. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి సెక్రెటేరియట్ కు వెళ్లి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కలుసుకున్నారు. తెలంగాణ ఎన్నికల్లో టికెట్ కోసం లాబీయింగ్ చేశారు. టికెట్ ఇస్తే టీడీపీలో చేరడానికి అభ్యంతరం లేదని విశదీకరించారు. కానీ కేసీఆర్ తో అనవసరంగా వైరం ఎందుకు అనుకున్నారో ఏమో కానీ రమ్యరావు చేరికను బాబు అంగీకరించలేదని సమాచారం.
 
అప్పటి నుంచే టీడీపీతో సన్నిహిత సంబంధాలను నెరపుతున్న రమ్యరావు తాజాగా తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారానికి శ్రీకారం చుట్టారు. గ్రేటర్ హైదరాబాద్ లో ఆమె టీడీపీ అభ్యర్థులను గెలిపించే పనిలో పడ్డారు.
 
తాజా సమాచారం ఏంటంటే రమ్యరావు ఇటీవలే టీడీపీలో చేరి కూకట్ పల్లి టికెట్ పొందిన హరికృష్ణ కూతురు నందమూరి సుహాసిని తరుఫున కూకట్ పల్లిలో లో ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ సోదరుడి కూతురు ఏకంగా టీడీపీ అభ్యర్థి తరుఫున ప్రచారం చేస్తుండడంతో కూకట్ పల్లి నేతల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. ఆమె ప్రచారంలో కేసీఆర్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఆయన చర్యలను ఎండగడుతోంది. ఈ పరిణామం మహాకూటమి నేతలకు కొండంత బలాన్ని ఇచ్చినట్టవుతోంది.
 
ఇలా కల్వకుంట్ల - నందమూరి మహిళలు కూకట్ పల్లిలో ప్రచారం చేస్తుండడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.Top