కూటమికి దిమ్మతిరిగే దెబ్బ వేసాడు !

By Xappie Desk, November 26, 2018 10:05 IST

కూటమికి దిమ్మతిరిగే దెబ్బ వేసాడు !

తెలంగాణ రాష్ట్రంలో అతి కొద్ది రోజుల్లో జరగబోతున్న రెండు అసెంబ్లీ ఎన్నికల విషయంలో తెలంగాణ రాజకీయ ముఖచిత్రం రోజుకో విధంగా మారిపోతుంది. ఇటీవల టీఆర్ఎస్ పార్టీకి చెందిన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కెసిఆర్ కి షాక్ ఇస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా ఉన్న క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక నేత టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల ఇబ్రహీంపట్నంలో కేసీఆర్ బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ నేత రంగారెడ్డి జిల్లా మాజీ డి సి సి ప్రెసిడెంట్ క్యామ మల్లేశ్ టిఆర్ఎస్ పార్టీలో చేరారు.
 
ఇంతకి పార్టీ మారడానికి గల విషయం ఏమిటంటే తెలంగాణ లో జరగబోయే రెండో అసెంబ్లీ ఎన్నికల విషయంలో క్యామ మల్లేశ్ ఇబ్రహీంపట్నం నుండి కాంగ్రెస్ పార్టీ తనను అభ్యర్థిగా ప్రకటిస్తుందని ఆశించాడు..అయితే అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ కి సంబంధించిన నాయకుడు అయిన సామ రంగారెడ్డిని కూటమి అభ్యర్థిగా ఇబ్రహింపట్నం నుంచి పోటీకి దింపారు. కానీ సామ రంగారెడ్డి ఎల్బీ నగర్ లో పోటీ చేసేందుకు చివరి వరకు ప్రయత్నించారు. ఎల్బీ నగర్ లో సీరియస్ గా గత కొంతకాలంగా పనిచేసుకుంటూ వచ్చారు. అనూహ్యంగా సామ రంగారెడ్డిని ఇబ్రహింపట్నం బరిలోకి దింపింది టిడిపి. దీంతో తనకు టికెట్ వస్తుందని ఆశపడ్డ క్యామ మల్లేష్ కాంగ్రెస్ పార్టీ నేతలపై విరుచుకుపడ్డారు.
 
అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీ తన సామాజిక వర్గమైన యాదవ సామాజిక వర్గాన్ని నిర్లక్ష్యం చేస్తోందని..తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ యాదవ సామాజిక వర్గానికి ఒక్క సీటు కేటాయిస్తే కెసిఆర్ పార్టీ ఆరు స్థానాలు కేటాయించిందని పేర్కొన్నాడు. ఇందుమూలంగా నే కాంగ్రెస్ పార్టీని వీడి టిఆర్ఎస్ పార్టీలో చేరానని క్యామ మల్లేశ్ వ్యాఖ్యానించారు. దీంతో ఎన్నికలకు కొద్ది రోజుల ముందు క్యామ మల్లేశ్ తీసుకున్న ఈ నిర్ణయం మహాకూటమికి పెద్ద దెబ్బేనని కామెంట్లు చేస్తున్నారు రాజకీయ పరిశీలకులు.
 Top