రేవంత్ రెడ్డి బూతుల బెదిరింపులు .. తెలంగాణా లో కలకలం !

By Xappie Desk, November 26, 2018 10:07 IST

రేవంత్ రెడ్డి బూతుల బెదిరింపులు .. తెలంగాణా లో కలకలం !

కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మళ్లీ ఆడియో టేపులో దొరికిపోయారు. ఒక టైంలో ఓటుకు నోటు కేసులో అడ్డంగా ఆడియో మరియు వీడియో టేపుల్లో దొరికిపోయి కొన్ని రోజులు రేవంత్ రెడ్డి జైల్లో ఉన్న సంగతి మనకందరికీ తెలిసినదే. అయితే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికల ప్రచారంలో టిఆర్ఎస్ పార్టీ కి చుక్కలు చూపిస్తున్న రేవంత్ రెడ్డి తన నియోజకవర్గం కొడంగల్ లో ఒక అధికారిని తిట్టిన ఆడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కల్వకుర్తి బిజెపి అభ్యర్థి ఆచారి.
 
కొడంగల్ లో ఎ.ఇ. వినోద్ అనే అధికారిని రేవంత్ రెడ్డి ఫోన్ చేసి బూతులు తిట్టారు. పక్క నియోజకవర్గ ఎమ్మెల్యే వచ్చిన సందర్భంలో కొడంగల్ అధికారులు ఆ ఎమ్మెల్యే వద్దకు వెళ్లినట్లు రేవంత్ కు సమాచారం అందింది. దీంతో ఎఈ కి ఫోన్ చేసి పరమ బూతులు తిట్టారు. అధికారులు అని కూడా చూడకుండా ఈపులు పలగొడతా అన్నారు. డీఈని నిన్ను బట్టలూడదీసి కార్యకర్తలతో కొట్టిస్తా అని రేవంత్ కరుకు భాషలో తిట్ల పురాణం అందుకున్నారు. కొడంగల్ కు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నరా అంటూ ఆ అధికారిని భయపెట్టారు. దీంతో ఈ ఆడియో ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది.
 Top