"మోడీ తండ్రి ఎవడు" దారుణ వ్యాఖ్యలు చేసాడు ఇతను !

By Xappie Desk, November 26, 2018 11:13 IST

ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు రాజ్ బబ్బర్ ప్రధాని మోడీ పై దారుణమైన కామెంట్లు చేశారు. మోడీ వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ రాజ్ బబ్బర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జాతీయ రాజకీయాలలో కలకలం సృష్టిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల రాజ్ బబ్బర్ ఇండోర్ లో జరిగిన మహాసభలో మాట్లాడుతూ ఒకానొక సమయంలో ఆయన (మోడీ) డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ నాటి ప్రధాని (మన్మోహన్ సింగ్) వయస్సును చేరుకుంటున్నదని చెప్పేవారు.
 
నేడు రూపాయి విలువ ఎంతకు పడిపోయిందంటే.. అది మీ అమ్మగారి వయస్సుకు చేరువైంది అని అన్నారు. ప్రధాని మోడీ తల్లి హీరాబెన్మోడీ వయస్సు ఇప్పుడు 97 ఏండ్లు. బబ్బర్ వ్యాఖ్యల పై తీవ్రంగా విరుచుకుపడిన ప్రధాని మీరు నా తల్లి పేరును రాజకీయాల్లోకి లాగుతున్నారు. ఇటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ కు ఆ పార్టీ నేతలకు తగునా? అని నిలదీశారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడా తగ్గకుండా మోడీ ప్రశ్నించిన తర్వాత రోజే అసలు మోదీ తండ్రెవరో తెలియదంటూ కాంగ్రెస్ నేత విలాస్రావ్ ముట్టెంవర్ చేసిన కామెంట్లో ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ గా మారాయి.
 
ఈ క్రమంలో రాహుల్ గాంధీ గారి గురించి ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ తండ్రి ఎవరో అందరూ చెప్పగలరు ఐదు తరాల వరకు ప్రతి భారతీయుడికి రాహుల్ గాంధీ కుటుంబ విషయాలు తెలుసని పేర్కొన్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు గురించి మాట్లాడగలరా అంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ప్రధాని మోడీ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
 Top