పవన్ కళ్యాణ్ మీద కే ఏ పాల్ కామెడీ !

పవన్ కళ్యాణ్ మీద కే ఏ పాల్ కామెడీ !

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రపంచ శాంతి పార్టీ వ్యవస్థాపకుడు క్రైస్తవ మత ప్రబోధకుడు ఆయనకేఏ పాల్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఇప్పుడు అందరికీ నవ్వు పుట్టిస్తున్నాయి. ఇటీవల ఓ టీవీ లైవ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న కే ఏ పాల్ పవన్ కళ్యాణ్ అంటే ఎవరో నాకు తెలియదు ఆయనను ఇటీవలే మొదటి సారి చూసాను అని వ్యాఖ్యానించారు. దీంతో మరికొద్ది నిమిషాల్లోనే పవన్ చాలా చక్కగా మాట్లాడడం గలుగుతున్నానని పది నిమిషాల్లోనే ఆయన నన్ను ఎంతగానో ఆకట్టు కున్నారు అంటూ కుదిరితే రాజకీయాల్లో ఆయన రాణించడానికి ఆయన నా దగ్గరకు తీసుకు వస్తే ప్రార్థిస్తాం అని లైవ్ లో పవన్ కళ్యాణ్ కి బంపర్ ఆఫర్ ఇచ్చారు కేఏ పాల్. పాల్ ఆఫర్ అంతటితో ఆగిపోలేదు. పవన్ వద్ద డబ్బులేదు. తేలేడు. నేను ఎంత కావాలంటే అంత తేగలను. అతను అడిగింది ఇవ్వగలను. సీఎంను చేయగలను అన్నారు.
 
చిత్రమేంటంటే... టీవీ లైవ్ లో ఈ వ్యాఖ్యలు చేసిన పవన్ అక్కడే ప్రార్థన కూడా చేసేశాడు. రా నువ్వు రా ...నా వద్దకు రా ... నాలో కలిసిపో... నాలో కలిస్తే నువ్వు సీఎం అయిపోయినట్టే. నువ్వు నాకు గట్టి తమ్ముడు* అంటూ ప్రార్థించేశారు. చిరంజీవి గురించి గురించి పాల్ ఓ సీక్రెట్ కూడా చెప్పారు. ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో కలుపుతున్నట్టు తన స్నేహితుడైన చిరంజీవి ఒక్క మాట కూడా చెప్పలేదట. దానికి అప్పట్లో పాల్ హర్టయ్యారట. అలాంటి దుస్థితి పవన్కు వద్దని ... పవన్ పార్టీ జనసేన తప్పకుండా తన పార్టీలోనే కలవాలని... దానివల్ల పవన్ ముఖ్యమంత్రి అవుతారని ప్రి మెర్జ్ ఆఫర్ ఇచ్చారు పాల్. దీంతో టివి ఇంటర్వ్యూలో లైవ్ లో పవన్ కళ్యాణ్ మీద కేఏ పాల్ చేసినా వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా సోషల్ మీడియాలో. కామెడీలు పుట్టిస్తున్నాయి.
 Top