ఈడీ తప్పు అంటారా సుజనా గారు ??

By Xappie Desk, November 26, 2018 11:25 IST

ఈడీ తప్పు అంటారా సుజనా గారు ??

తప్పుడు కంపెనీలు సృష్టించి బ్యాంకుల దగ్గర నుండి రుణం తీసుకుని దారుణంగా బ్యాంకులకు రుణాలు ఎకొట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ కేంద్రమంత్రి రాజకీయాలలో చంద్రబాబు కి కుడిభుజంగా వ్యవహరించే సుజనా చౌదరి పై ఇటీవల కేంద్ర దర్యాప్తు సంస్థ అయినా ఈ డి సుజనా చౌదరి కి సంబంధించిన కార్యాలపై కంపెనీలో పై దాడులు చేయడంతో అనేకమైన విషయాలు బయటకు వచ్చాయి.
 
దీంతో సుజనా చౌదరి విషయం జాతీయ మీడియా లో ను ఇటు రాష్ట్ర మీడియాలోనూ పెద్ద హైలెట్ అవుతున్న క్రమంలో..సుజనా చౌదరి తనపై జరిగిన దాడిని కేంద్రం ఆంధ్ర రాష్ట్రం పై చేసే దాడి అన్నట్టుగా చిత్రీకరిస్తున్నారు. నిజాయితీగా రాజకీయాలు చేస్తున్న కాబట్టే నా మీద ఇటువంటి దాడి జరిగిందని ఇటువంటి అవినీతి కార్యక్రమాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు సుజనా చౌదరి. తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తే న్యాయపరంగా ఫిర్యాదు చేస్తానని సుజనా చౌదరి హెచ్చరించారు.
 
``సాంకేతికంగా కొన్ని సమస్యలు ఉంటే వాటికి పెనాల్టీ వేసి కట్టించుకోవచ్చు. నాకున్న స్టీల్ ప్లాంట్లో భారీ నష్టం వాటిల్లింది. వాటి జోలికి ఈడీ ఎందుకు వెళ్లలేదు?' అని సుజనా ప్రశ్నించారు. బెస్ట్ అండ్ క్రాంప్టన్పై ఫిర్యాదు వచ్చింది అని ప్రెస్ నోట్లో ఇచ్చారని.. కానీ ఆ కంపెనీతో తనకు సంబంధం లేదని చెప్పారు. దురుద్దేశంతోనే ఈడీ తన పై దాడులు చేస్తుందని...ఈడీ దాడులకు సంబంధించి త్వరలో న్యాయస్థానానికి వెళ్తాననే పేర్కొన్నారు సుజనా చౌదరి.Top