బాబు ని ఇరికించబోతున్న చౌదరి ?

By Xappie Desk, November 26, 2018 14:17 IST

బాబు ని ఇరికించబోతున్న చౌదరి ?

రాజకీయాలలో టిడిపి అదినేత ఏపీ సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తుల్లో ఒకరు సుజనా చౌదరి. మొన్నటి వరకు మోడీ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన సుజనా చౌదరి తన పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చారు. అయితే తాజాగా ఆయన డొల్ల కంపెనీలు పెట్టి బ్యాంకుల దగ్గర రుణాలు తీసుకొని ఎగ్గోట్టిన విషయం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో ను రాష్ట్ర రాజకీయాలలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది.
 
ఈ క్రమంలో ఈడి సుజనా చౌదరి కి సంబంధించిన కార్యాలయాలపై కంపెనీలపై దాడులు చేయడంతో అనేకమైన సంచలన కరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా సుజనా చౌదరి పై జరిగిన దాడుల విషయంలో బయటపడిన వెలుగులోకి వచ్చిన అనేకమైన విషయాలు బట్టి సుజనా చౌదరి దారుణమైన ఆర్థిక నేరగాడు గా త్వరలో న్యాయస్థానం పరిగణించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
 
అయితే ఇంతటి నేర చరిత్ర కలిగిన వ్యక్తి కేంద్ర మంత్రివర్గంలో చంద్రబాబు సిఫార్సుతో మోడీ క్యాబినెట్ లో పనిచేయడంతో దేశంలో ఉన్న కొన్ని జాతీయ పార్టీలు మోడీ పై దారుణమైన కామెంట్లు చేస్తున్న నేపథ్యంలో...ఇంతకీ సుజనాచౌదరి కి చంద్రబాబు కి మధ్య ఎటువంటి సంబంధం ఉందో..చాలాసార్లు రాజ్య సభకి తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు ఎందుకు పంపించారో వంటి విషయాలపై...ముఖ్యంగా ఏపీ రాష్ట్రంలో విపక్ష పార్టీలు చంద్రబాబు బినామీ సుజనా చౌదరి అని కామెంట్లు వస్తున్న క్రమంలో త్వరలో చంద్రబాబు పై కేంద్రం సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.Top